ఫాదర్ స్టాన్ స్వామి విడుదలకొరకు ప్రార్థనలు

హైదరాబాద్ పీఠంలో సేవలందిస్తున్న మఠవాస దైవాంకితులు మార్చి 21వ తేదీన వారి తపస్సుకాల ప్రత్యేక ప్రార్ధనను లూర్దుమత చర్చ్,ధర్మారం, నిజామాబాద్ నందు జరిగింది.  దైవాంకితులకు ప్రెసిడెంట్ గా ఉన్న గురువు శ్రీ బెల్లంకొండ సుధాకర్ గారి అధ్యక్షతన, గురువు సాల్విన్  రాజ్  వాక్య పరిచర్యతో ఈ తపస్సుకాల ప్రత్యేక ప్రార్ధనలు ఘనంగా జరిగాయి.  
ప్రతేకం గా ఫాదర్ స్టాన్ స్వామి విడుదలకొరకు ప్రార్థనలు చేసారు. గత వారం ఫాదర్ స్టాన్ స్వామి పెట్టుకున్న బెయిల్ నిరాకరాయించడం తెలిసిందే.    
భీమా కోరెగావ్ కేసులో గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన తీవ్ర ఉద్రిక్తతల మధ్య స్వామిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసారు. అక్టోబర్ 9నుండి ఫాదర్ స్వామి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.

Add new comment

11 + 7 =