ఫాతిమామాత పండుగ సంబరాలు

వరంగల్ మేత్రాసనం, ఫాతిమా నగర్ నందు మర్చి 13, 2023న ఫాతిమామాత పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి.    

మహోత్సవానికి ప్రధానార్చకులుగా మహా పూజ్య అంతోని ప్రిన్స్ ఆదిలాబాద్ పీఠాధిపతులవారు మరియు వరంగల్ మేత్రానులు, ఖమ్మం పాలనాధికారి మహా పూజ్య ఉడుముల బాల తండ్రిగారు దివ్యపూజను సమర్పించారు.  

మహోత్సవాలలో భాగంగా ఫాతిమామత తేరు ప్రదక్షణలు, స్వస్థతా ప్రార్ధనలు, కొవ్వత్తులతో దివ్యసత్ప్రసాద ప్రదక్షణలు, దివ్యసత్ప్రసాద ఆరాధనా కార్యక్రమములు జరిగాయి.

మహోత్సవానికి గురువులు,మఠకన్యలు,విశ్వాసులు అధికసంఖ్యలో హాజరయ్యారు. 

ఫాతిమా మరియా దేవుని చేత, దేవ దూతల చేత స్తుతించబడి గౌరవించబడినది. కాబట్టి వరంగల్లు పీఠ పాలకురాలైన ఫాతిమామాత తిరునాళ్ళ సందర్భముగా దేవుని ప్రార్థించుటకు, మరియ తల్లి సహాయం పొందుటకు వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు.

ఫాతిమా కథిడ్రల్ దేవుని వరాలకు, స్వస్థతలకు నిలయం, పోర్చుగల్ దేశము నుండి కొని వచ్చిన ఫాతిమా మాత స్వరూపము కొలువైన ఆలయమే మన ఫాతిమా కథడ్రల్, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ తల్లి ఆర్తుల మొరలు ఆలకిస్తూ రోగులను స్వస్థపరుస్తూ మానసిక వేదనలు అనుభవించు వారిని దీవిస్తూ బహుగా ఆశీర్వదిస్తుంది. 

విచారణ గురువులు గురుశ్రీ కాసు మర్రెడ్డి గారు మహోత్సవానికి విచ్చేసిన ప్రతిఒక్కరికి పండుగ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.

Add new comment

1 + 1 =