ప్రారంభమైన CCBI 34వ ప్లీనరీ అసెంబ్లీ సమావేశాలు

ప్రారంభమైన CCBI  34వ ప్లీనరీ అసెంబ్లీ సమావేశాలు  
 
భారతీయ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య  (CCBI) వారు  తన  34వ ప్లీనరీ అసెంబ్లీ  సమావేశాలను 24  నుండి 30 జనవరి 2023 మధ్య "పునీత యోహాను నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్" బెంగళూరులో జరగనున్నాయి.

 ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ "  సినడ్ నేపథ్యంలో క్రీస్తు ప్రభువుని  జీవిత చరిత్రను వివరించడం"   అనే అంశంపై జరగనున్నది.

ఈ కార్యక్రమంలో మహా పూజ్య  లూయిస్ ఆంటోనియో కార్డినల్ ట్యాగ్లే, ప్రో-ప్రిఫెక్ట్, డికాస్టరీ ఫర్ ఎవాంజలైజేషన్ గారు  ప్రారంభ ప్రసంగం చేస్తారు. అనంతరం మహా పూజ్య  ఫిలిప్ నెరి కార్డినల్ ఫెర్రో, ప్రెసిడెంట్, CCBI, గారు అధ్యక్ష ప్రసంగాన్ని అందించనున్నారు. భారతదేశం మరియు నేపాల్‌కు అపోస్టోలిక్ నన్షియో, మహా పూజ్య  లియోపోల్డో గిరెల్లి గారి ద్వారా ఆశీర్వాద సందేశాన్ని ప్రజలకు అందించనున్నారు.   

పోప్ ఫ్రాన్సిస్ గారి  సందేశాన్ని CCBI వైస్ ప్రెసిడెంట్ మోస్ట్ రెవ. జార్జ్ ఆంటోనిసామి చదివి వినిపిస్తారు, ఆ తర్వాత వార్షిక నివేదికను ఢిల్లీ ఆర్చ్ బిషప్ మరియు CCBI సెక్రటరీ జనరల్ మోస్ట్ రెవ. అనిల్ జోసెఫ్ థామస్ కౌటో సమర్పిస్తారు.

ఈ కార్యక్రమానికి కార్డినల్ మహా పూజ్య  ఓస్వాల్డ్  గ్రాసియాస్(బొంబాయి ఆర్చ్ బిషప్), మరియు కార్డినల్ మహా పూజ్య ఆంథోనీ పూలా( హైదరాబాద్ ఆర్చ్ బిషప్) మహా పూజ్య పీటర్ మచాడో( బెంగుళూరు ఆర్చ్ బిషప్)  మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజా రావు గారు (విజయవాడ మేత్రానులు)  మరియు  సీసీబీఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ గురుశ్రీ  స్టీఫెన్‌ అలత్తర కూడా హాజరయ్యారు .

 

Add new comment

2 + 3 =