ప్రస్తుత పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీలంక అధ్యక్షుడు పదవి నుండి వైదొలగాలి 

శ్రీలంకకార్డినల్ రంజిత్

శ్రీలంక అధ్యక్షుడు మరియు ప్రభుత్వం తమ పదవుల నుండి వైదొలిగి ప్రజలకు అధికారాన్ని అప్పగించాలని జూలై 5న పత్రికా ప్రకటనలో మాల్కం కార్డినల్ రంజిత్ అభ్యర్థించారు.

ప్రస్తుత ప్రభుత్వం మరియు రాష్ట్రపతి వైఫల్యాన్ని అంగీకరించి దేశంపై మరింత బాధను కలిగించకుండా అధికారాన్ని వదులుకోవాలని కార్డినల్ రంజిత్ పిలుపునిచ్చారు.

"అందరికీ విశ్వసనీయంగా మరియు పారదర్శకంగా ఉండే రీతిలో కావలసిన నిర్మాణాత్మక మార్పులను ప్రభావితం చేయడానికి ప్రజలు మధ్యంతర బహుళపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు" అని ఆయన అన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించడంలో సాంకేతిక మరియు వృత్తిపరమైన నిపుణుల బృందం స్వల్పకాలిక ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయగలదని కార్డినల్ ఉద్దేశపడ్డారు.

"సంవత్సరాలుగా, ప్రస్తుత పరిపాలన యొక్క విశ్వసనీయత ఒక స్థాయికి పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు లేదా రాజ్యాంగాన్ని మార్చడానికి వారు చేసిన అన్ని ప్రయత్నాల కోసం వారు ప్రజలచే పూర్తిగా తిరస్కరించబడ్డారు" అని కార్డినల్ రంజిత్ అన్నారు.

గత రెండున్నర సంవత్సరాల్లో దేశం యొక్క విదేశీ మారక నిల్వలు 70 శాతానికి దారుణంగా పడిపోయాయి, దీని వలన 22 మిలియన్ల జనాభా గల దేశం స్వాతంత్య్రం తర్వాత అతి ఘోరమైన  ఆర్థిక పీడకలని ఎదుర్కొంటుంది.

దీని ఫలితంగా రోజుకు 13 గంటలపాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది, అలాగే ఆహారం, ఇంధనం, వంటగ్యాస్ మరియు ఔషధాల కొరత ఏర్పడింది మరియు ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 17.5 శాతానికి పెరిగింది, ఫలితంగా దేశంలో కరెన్సీ తరుగుదల, వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నాయి. 

"ప్రభుత్వం ప్రజలపై మోపిన అణచివేత, మొండి భారాలను మేము ఖండిస్తున్నాము" అని కార్డినల్ రంజిత్ అన్నారు.

ఈ దేశంలో మెజారిటీ ప్రజలు రాజపక్సాలను విశ్వసించనప్పటికీ, దేశాన్ని విముక్తి చేయడానికి అతిపెద్ద అడ్డంకి వారి నిరంతర పాలన.

రాజపక్సాల అధికార పార్టీ ప్రజల సంక్షేమం కంటే తమ రాజకీయ అధికారమే ముఖ్యమని భావిస్తోందని కార్డినల్ అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పని చేయడం లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్షుడికి, ఆయన ప్రభుత్వానికి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.

"బాధపడుతున్న ప్రజల తరపున, విచారకరమైన పరిస్థితికి బాధ్యత వహించి, వారి పదవుల నుండి వైదొలగండి" అని కార్డినల్ రంజిత్ ముగించారు.
 

Add new comment

15 + 0 =