ప్రసార మాధ్యమాలు వారధులు నిర్మించేవిగా ఉండాలి , సంఘాలు మరియు వ్యక్తుల మధ్య ఉన్న గోడలను పడగొట్టేవిగా ఉండాలి

Catholic Press AssociationPope Francis

ప్రసార మాధ్యమాలు వారధులు నిర్మించేవిగా ఉండాలి , సంఘాలు మరియు వ్యక్తుల మధ్య ఉన్న గోడలను పడగొట్టేవిగా ఉండాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

 

వృత్తిపరమైన పోటీలో పడకుండా "పరిపూర్తిగా ఇతరుల మంచి కోసం" కృషి చెయ్యాలని కథోలిక ప్రసారం మాధ్యమాలకు ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు.

జూన్ 30 న జరిగిన ఈ సంవత్సరపు కథోలిక ప్రసార మాధ్యమాల సదస్సులో ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ, వివాదాలు, విభేదాలతో నిండిపోయిన ఈ సమయంలో కాథోలికులు కూడా దీనికి మినహాయింపు కాదు" అని ఆయన అన్నారు.

ప్రసార మాధ్యమాలు వారధులు నిర్మించేవిగా ఉండాలని, సంఘాలు మరియు వ్యక్తుల మధ్య ఉన్న గోడలను పడగొట్టేవిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

పక్షపాతం లేనటువంటి స్వచ్ఛమైన సత్యాలను ప్రజలకు చూపించి, మంచికి చెడుకు మధ్య తేడాను నిర్ణయించుకోవడానికి వారికి సహాయం చెయ్యాలని ప్రసారమాధ్యమాలు పాపు గారు కోరారు.

నిజమైన ప్రసారకుడు ప్రతి దశ లో కూడా ఇతరుల మంచికోసమే పరిపూర్తిగా కృషి చేస్తాడని ఆయన వొక్కాణించారు.

పునీత పౌలు గారు చెప్పినట్లు మనందరం ఒకరి కోసం ఒకరం అనే మాట మనకు ఈ కరోనా మహమ్మారి వల్ల స్పష్టమైందని ఆయన గుర్తు చేసారు.

గత కొన్ని నెలలుగా ప్రపంచంలోని పరిస్థితులను చుస్తే, ప్రసార మాధ్యమాలు మనకు ఎంత ఉపయుక్తం, వాటివలన దూరాలు ఎలా తరిగిపోతున్నాయి, మనకు అవసరమైన సమాచారం ఏంటి , దాని వలన మన మనసులు, ఆలోచనలు, సత్యానికి తెరిచి ఉంచే విధంగా ఎలా చేశాయో మనం చూసాం అని ఆయన అన్నారు.

అన్ని ప్రచార, సమాచార సాధనాలు ఆ త్రిత్వ దేవుని లోనే మూలాలు కలిగి ఉంటాయి. ఈ త్రిత్వయిక దేవుడు తన పవిత్రత యొక్క గొప్పతనాన్ని మనతో పంచుకొని, దానిని మనం ఇతరులతో పంచుకోవాలని పిలుపునిస్తున్నారని పాపు గారు ప్రబోధించారు.

ప్రపంచమంతా విభేదాలు, విద్వేషాలు చూస్తున్న చోట మనం బాధలు పడుతున్న అభాగ్యులను చూడాలి, వారి స్వరం మన సహోదరి సహోదరులకు చేరేలా కృషి చెయ్యాలి అని పాపు గారు హితవు పలికారు.

కథోలిక సమాచార, ప్రచార మాధ్యమాలు ఐక్యతకు చిహ్నాలుగా ఉండాలని, తమ పనికి ఆటంకం కలిగించే దానిని దేనినైనా ప్రోత్సహించకూడదని ఆయన సూచించారు.

మనం ఒక ఆత్మలో మరియు ఒక శరీరంలో బాప్తిస్మము ద్వారా అభిషేకించబడ్డాము. వేరు వేరు గా ఉన్నా మనం ఆ దేవునిలో ఏక శరీరులమే అని, "టుగెథెర్ వైల్ అపార్ట్" అనే ముఖ్య ఉద్దేశం ఉన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి పాపు గారు అన్నారు.

గత 100 సంవత్సరాలలో మొట్టమొదటి సారిగా కరోనా మహమ్మారి వల్ల ఈ సమావేశం ఆన్ లైన్ లో జరిగింది. 

ఒహియో, కొలంబస్ లో 1911 లో కాథలిక్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించి ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహకరమైన కథోలిక ప్రసారాకుల సంస్థగా అభివర్ణించారు.

సేవ మరియు ఐక్యతలు ముఖ్య ఉద్దేశాలుగా ఉన్న ఈ సంస్థలో 225 ప్రచురణ కర్తలు మరియు 600 మంది వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు.

కరోనా వల్ల బాధ పడుతున్న వారికి, మరియు వారికి సహాయం చేస్తున్న ఎందరో సహోదరి సహోదరులకు తాను ఎంతో దగ్గరగా ఉన్నానని వ్యక్తం చెయ్యడం ద్వారా ఈ సదస్సును పాపు గారు ప్రారంభించారు.

Add new comment

1 + 1 =