ప్రభువు నందు నిద్రించిన డొమినిక్ గురువు

ప్రభువు నందు నిద్రించిన డొమినిక్ గురువు 
 
ఫిలిప్పీన్స్ సెంట్రల్ సెమినరీలో ఆధ్యాత్మిక డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన డొమినికన్ గురువులలో ఒకరైన గురుశ్రీ టెజెరో గారు ఆగస్టు 4న మరణించారు.
 
గురుశ్రీ పెడ్రో గొంజాలెజ్ టెజెరో గారు 101 ఏళ్ల వృద్ద గురువు. వీరి స్వగ్రామం స్పెయిన్‌లోని పాలెన్సియా నగరం.
 
1947లో ఇల్లినాయిస్‌లో డొమినికన్ గురువుగా నియమితులైన గురుశ్రీ టెజెరో గారు తన మాతృభూమి ఐన స్పెయిన్‌లో మరియు ఫిలిప్పీన్స్‌లో వివిధ హోదాల్లో సేవలందించారు.
 
గురుశ్రీ టెజెరో గారు డొమినికన్ ప్రావిన్స్ ఆఫ్ ది హోలీ రోసరీ సభ్యులు.ఆయన 1979 నుండి పదవీ విరమణ వరకు శాంటో టోమస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.1990 నుండి 2013 వరకు, సెంట్రల్ సెమినరీలో ఎక్కువ కాలం పనిచేసిన ఆధ్యాత్మిక డైరెక్టర్లలో గురుశ్రీ టెజెరో గారు ఒకరు. 
 
గురుశ్రీ టెజెరో గారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ అమృతవాణి  రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారి తరుపున అర్పిస్తున్న అశ్రునివాళి.
 
 
 
Attachments area
 
 

Add new comment

2 + 1 =