ప్రభువు నందు నిద్రించిన ఇండియన్ డివైన్ వర్డ్ ప్రొవిన్షియల్

సొసైటీ ఆఫ్ డివైన్ వర్డ్ (SVD) యొక్క ప్రొవిన్షియల్ సుపీరియర్ గురుశ్రీ పెట్రస్ కులు గారు ఆగస్టు 18న కోవిడ్-19తో ప్రభువునందు పరమపదించారు. కులు గారు ఆగష్టు 10, 1960న జన్మించారు. ఆయన ఫిబ్రవరి 13, 1992 న గురువుగా నియమితులయ్యారు.  గురుశ్రీ పెట్రస్ కులు గారి వయసు 62 సంవత్సరాలు.

వాతావరణ మార్పుల కారణంగా గురుశ్రీ కులు గారు ఆగస్టు 12 నుండి న్యుమోనియా మరియు కడుపునొపితో అస్వస్థతకు గురయ్యారు. ఆగస్టు 16న ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది రావడంతో ఝార్సుగూడలోని సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో చేర్పించారు. హాస్పిటల్‌లో ప్రాథమిక పరీక్షల తర్వాత, కులు గారు తీవ్రమైన న్యుమోనియా మరియు ఛాతీ రద్దీతో బాధపడుతున్నట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. కులు గారు ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నందున, కులు గారిని సంబల్‌పూర్‌ లోని వికాష్ హాస్పిటల్ కు తరలించారు. ఆగస్టు 17న అన్ని పరీక్షల తర్వాత, వైద్యుల బృందం ఆయనకు కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయని తన ఊపిరితిత్తులకు అప్పటికే కొరోనా వ్యాపించినట్లు నిర్ధారించారు.

అన్ని వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ, కులు గారి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం కోలుకోలేదు అని డివైన్ వర్డ్ వైస్ ప్రొవిన్షియల్ సుపీరియర్ గురుశ్రీ విక్టర్ రోడ్రిగ్స్ గారు తెలిపారు. ఇండియన్ కరెంట్స్ మ్యాగజైన్ ఎడిటర్ గురుశ్రీ సురేష్ మాథ్యూ గారి ప్రకారం, COVID-19 కారణంగా భారతదేశంలో కనీసం 570 మంది కథోలిక గురువులు మరియు మఠకన్యలు మరణిస్తున్నారని తెలియజేశారు.

 

Article by

P.Pavan Kumar

RVA Telugu Service

Add new comment

1 + 5 =