ప్రభుని  సేవలో 50  వసంతాలు పూర్తి చేసుకున్న బంగ్లాదేశ్ ఓబ్లేట్ గురువులు

ప్రభుని  సేవలో 50  వసంతాలు పూర్తి చేసుకున్న బంగ్లాదేశ్ ఓబ్లేట్ గురువులు  

బంగ్లాదేశ్ లోని మిషనరీ ఒబ్లేట్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ (ఓఎంఐ)  50 వసంతాలను పూర్తి చేసుకుంది . జూలై 29న దేశానికి ఈశాన్య ప్రాంతంలోని మౌల్వీబజార్ లోని లోఖీపూర్ లోని చర్చ్ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్(Church of Immaculate Conception) లో 50 వసంతాల  పండుగ జరుపుకుంది. 
 
ఒ.ఎం.ఐ సభ్యులు బంగ్లాదేశ్ లో "ఆబ్లేట్ ఫాదర్స్"(Oblate Fathers)గా ప్రసిద్ధి చెందారు.
 రాజ్షాహీకి చెందిన బిషప్ గెర్వాస్ రోజారియో, సిల్హెట్కు చెందిన బిషప్ షోరోట్ ఫ్రాన్సిస్ గోమ్స్, ఓబ్లేట్స్ గురువులు , వివిధ స౦ఘాలకు చె౦దిన సన్యాసినులు, హోలీ క్రాస్ గురువులు , సహోదరులు, సెమినమినరియన్లు, వివిధ గ్రామాలకు చె౦దిన 500 మ౦ది క్యాథలిక్కులు, సిల్హెట్ పీఠానికి  చె౦దిన వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ 50 స౦వత్సరాల ప్రభు సేవలో  దేవుడు ఎంతగానో దీవించారని, ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలే తమను ముందుకు నడిపిస్తున్నాయని, వారికీ చేసిన సేవలే మా కృతజ్ఞత అని  ఓఎంఐ సుపీరియర్ గురుశ్రీ  అజిత్ విక్టర్ కోస్టా గారు అన్నారు.   చర్చికి మరియు సమాజానికి ఒబ్లేట్స్ చేసిన సహకారాన్ని చాలా మంది ప్రశంసించారు.

జాతీయ సెమినరీలో భావి యాజకులకు శిక్షణనివ్వడానికి సహాయ౦ చేయడమే కాక, ఈ జూబ్లీ వేడుక ముస్లి౦ ఆధిక్యతగల దేశ౦లో క్రీస్తుని సువార్తను చూపి౦చి౦ది, స్వదేశీయులు, జాతి సముదాయాలు మరియు  వలసదారులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి౦చి౦ది.
"ఒబ్లేట్ గురువులు  మాకు దగ్గరగా ఉంటారు మరియు వారు మాకు పూర్తి  మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని మింటూ రెమా, ఒక సాధారణ నాయకురాలు చెప్పారు. 

 

Add new comment

4 + 1 =