ప్రభుత్వ సహాయం కోసం బారులు తీరిన ప్రజలు 

local Aid from Governmentకిలోమీటర్ల కొలది బారులు తీరిన ప్రజలు

ప్రభుత్వ సహాయం కోసం బారులు తీరిన ప్రజలు 

అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక మంది గృహాలు దెబ్బతిన్న సంగతి మనకు విదితమే. తెలంగాణ ప్రభుత్వం వీరి సహాయార్ధం పది వేల రూపాయల వరకు నష్ట పరిహారాన్ని ప్రకటించింది. 

ఈ నష్ట పరిహారాన్ని పొందాలంటే ప్రజలు మీ సేవ కేంద్రాలలో వారి పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలలో మీ సేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో మీ సేవ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మీ సేవ కేంద్రాలలో ప్రజలను నియంత్రించలేక పోలీసు సిబ్బందిని కూడా రంగంలోనికి దించడం జరిగింది. 

ప్రజలు ఎండను కూడా లెక్క చెయ్యకుండా గంటల తరబడి మీ సేవ కేంద్రాల వద్ద నిలబడడం కనిపిస్తుంది.  దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొన్ని చోట్ల రోడ్ల మీద వెళుతున్న వాహనాలకు కూడా అంతరాయం కలుగుతుందని పలువురు వాహన చోదకులు అంటున్నారు.

ప్రభుత్వం త్వరపడి ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి తగు చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

Add new comment

5 + 0 =