ప్రభుత్వ అధికారులను కలిసిన తెలంగాణ రాష్ట్ర  క్రైస్తవ నాయకులు.

తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ  సమస్యలపై చర్చించడానికి మరియు ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం ఎదురుచూడడానికి క్రైస్తవ నాయకులు ప్రభుత్వ అధికారులను కలిశారు.

తెలంగాణ  సచివాలయంలో జనవరి 25 న రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సంక్షేమ శాఖా  మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు మైనారిటీ వ్యవహారాల సలహాదారి ఏకే ఖాన్‌తో మరియు క్రైస్తవ సంఘం పెద్దలు మతపరమైన అంశాలపై చర్చించారు. 

తెలంగాణలోని క్రైస్తవ దేవాలయాలు, మైనారిటీలపై దాడులు, కొత్త చర్చి నిర్మాణానికి అనుమతి, స్మశానవాటిక కోసం స్థలం, క్రైస్తవ మైనారిటీ విద్యార్థులకు  స్కాలర్‌షిప్‌లు గురించి చేర్చించారు.

రాష్ట్రంలోని క్రైస్తవుల భద్రత, కొత్త చర్చి మరియు స్మశానవాటిక కోసం భూమిని చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కే.సీ.ఆర్) సమాజానికి నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు క్రైస్తవ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశానికి హాజరైన 100 మందికి పైగా ప్రముఖ కథోలిక నాయకుల మరియు క్రైస్తవ మతాల నాయకులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ నాయకుడు రాయిడిన్ రోచ్, తెలుగు కాథలిక్ బిషప్ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ ఫాదర్ ఆర్లగడ్డ జోసెఫ్ మరియు ఏక్యూమినిజం కమిషన్ కార్యదర్శి ఫాదర్ కె. అంతయ్య పాల్గొన్నారు.

Add new comment

1 + 14 =