ప్రపంచ హృదయ దినోత్సవం | సెయింట్ తెరెసా 'స్ హాస్పిటల్

ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు.  ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భముగా సనత్ నగర్ లోని  " సెయింట్ తెరెసా 'స్ హాస్పిటల్" వారు గుండె జబ్బులపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. సిస్టర్ థామసమ్మ (sisterThomasamma) గారి ఆద్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భముగా సిస్టర్ థామసమ్మ గారు మాట్లాడుతూ  హృదయం ఆరోగ్యంగా వుండాలంటే ఎప్పుడూ నవ్వుతూ వుండాలి అని,  హృదయాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడానికి ఉత్తమ మార్గం సరైన ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడికి దూరంగా వుండటం అని తెలియజేసారు.
" సెయింట్ తెరెసా 'స్ హాస్పిటల్" డాక్టర్స్, నర్సులు   మరియు సిబ్బంది ఈ ర్యాలీలో ప్రజలను చైతన్య పరిచేలా స్లోగన్స్, బ్యానెర్లు తో పాల్గొన్నారు.   

సెయింట్ తెరెసా 'స్ హాస్పిటల్ 1960 నుండి ఆరోగ్య సంరక్షణ సేవలో ఉంది. సెయింట్ థెరిసా హాస్పిటల్ 300 పైగా పడకల మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా  ప్రపంచ స్థాయి సాంకేతికతలు మరియు MRI, CT స్కాన్, కార్డియాక్ క్యాథ్‌లాబ్ వంటి పరీక్షా కేంద్రాలు మరియు  అత్యాధునిక ఆపరేషన్ థియేటర్‌లు, అధునాతన లేబొరేటరీలు మరియు అత్యంత సమర్థవంతమైన అత్యవసర సదుపాయాలతో సహా 30 కి పైగా  అల్ట్రా మోడ్రన్ ICU బెడ్‌లు, మెడికల్ ICU, సర్జికల్ ICU లతో ఈ ప్రాంతంలోని అత్యుత్తమ హాస్పెటల్ గా పేరుగాంచింది  సెయింట్ తెరెసా 'స్ హాస్పిటల్ .సెయింట్ థెరిసా హాస్పిటల్ అనుభవజ్ఞులైన నిపుణులైన వైద్యులతో 24/7 సూపర్ స్పెషాలిటీ చికిత్సలను అందిస్తుంది.

Add new comment

1 + 0 =