Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ప్రపంచ జనాభా దినోత్సవం జులై 11 , 2020
ప్రపంచ జనాభా దినోత్సవం జులై 11 , 2020
సృష్టికర్త తన సృష్టి ఫలధీకృతమై భూమి మొత్తం వ్యాపించాలని చెప్పారు. అదే దేవుని చిత్తం. ఆయన సృష్టి అయిన మనం అది గ్రహించి ఆ దేవుని సృష్టిని వ్యాపింపచేసే బాధ్యత మనందరికీ ఉంది.
ఈ ప్రత్యేకమైన రోజున మనందరం చేతులు కలిపి ఆ దేవుని సృష్టిని సంరక్షించి వృద్ధి చెయ్యాలి.
ప్రతి సంవత్సరం జులై 11 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఇటువంటి రోజును గురించి మనలో కొందరు ఇంతకూ ముందు విని ఉండరు కానీ ఈ దినోత్సవాన్ని గత మూడు దశాబ్దాలుగా ప్రపంచం కొనియాడుతుంది.
ప్రపంచ జనాభా సమస్య పై దృష్టి పెట్టడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
జనాభా సమస్యలు అంటే కుటుంబ నియంత్రణ, లింగ సమానత, బాల్య వివాహాలు, మానవ హక్కులు, శిశు సంక్షేమం వంటివి అనమాట.
ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్యం మరియు అది ఎదుగుదల యొక్క ప్రణాళికలు మరియు కార్యక్రమాలపై చూపుతున్న ప్రభావాన్ని అర్ధం చేసుకోవడమే ఈ రోజు యొక్క సారాంశం.
కౌన్సిల్ అఫ్ యునైటెడ్ నేషనల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం వారు 1989 ఈ రోజును స్థాపించారు.
ఈ సంవత్సరం కరోనా వల్ల ఎన్నో దేశాలలో ఎందరో ప్రజలు బలి అయ్యారు. కానీ అన్ని దేశాలలో ఒకే రకమైన పరిస్థితి లేదు.
ప్రపంచ దేశాలు కరోనా ను ఎదుర్కొనే పనిలో మునిగిపోగా, పునరుత్పత్తి సేవలు పక్కకు పెట్ట బడ్డాయి. ఇంకా లింగ ఆధారిత హింసలు పెరిగిపోయాయి.
దేశాలు లాక్ డౌన్ ను ఇలానే కొనసాగిస్తే, లింగ ఆధారిత హింసలు 31 మిలియన్లకు చేరతాయని ఐక్యరాజ్య సమితి లోని జనాభా శాఖ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 శాతం మంది ఆడవారు పలు రకాలైన పనులలో ఉంటూ కరోనా బారిన పడే అవకాశం కలిగి ఉన్నారు.
పాఠశాలలు మూసివేయడం కారణంగా ఇళ్లలో మహిళలపై అదనపు పని భారం పడింది. ఈ మహమ్మారి మధ్యతరగతి వారిని బాగా దెబ్బ తీసింది. అసమానతలను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాన్ని ఈ కరోనా దెబ్బ తీస్తుంది.
ఈ ప్రపంచ జనాభా దినోత్సవం నాడు పునరుత్పత్తి వ్యవస్థను పెంపొందించడం, స్త్రీల అభివృద్ధి, ఆడ పిల్లల అభివృద్ధిని సూచిస్తూ UNFPA వారు ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చారు.
Add new comment