ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం

ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం

నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం.మొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వివిధ రకాల ఆహారాల వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన  కలిగించి  దానిని ఎలా నివారించాలనే చర్యల గురించి అవగాహన పెంచడమే ఈ రోజు లక్ష్యం.

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ కారణంగా ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా కలుషిత ఆహారం కారణంగా 600 మిలియన్ల ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ద్వారా శుభ్రమైన, సురక్షితమైన ఆహారపు ప్రాధాన్యతపై ఐరాస ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడుచేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలుకొని, విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.
మానవ ఆరోగ్యానికి, ఆర్థిక శ్రేయస్సుకు, సుస్థిర అభివృద్ధికి,వ్యవసాయ అభివృద్ధి, పర్యాటక రంగానికి సురక్షిత ఆహారం, ఆహార భద్రత ఎంత ముఖ్యమైనది.

 

 

Add new comment

5 + 4 =