ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పోప్ ప్రాన్సిస్‌తో భేటీ అయ్యారు

రోమ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు  పోప్ ప్రాన్సిస్‌తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య సుమారు  గంటపాటు సమావేశం జరిగింది. పోప్ ప్రాన్సిస్‌తో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు ఆహ్వానించారు. అంతర్జాతీయ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ అభిప్రాయాలు ఇరువురు పంచుకున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత ట్విట్టర్ లో ట్విట్ చేసారు మరియు  ఫోటోలను షేర్ చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం చాలా ఆహ్లాదంగా జరిగింది అని, భారతదేశాన్ని సందర్శించాలని కూడా నేను ఆహ్వానించాను’ అని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.

 

Add new comment

3 + 6 =