పోప్ ఫ్రాన్సిస్ పర్యటన  శాంతి కి దోహదం చేస్తుందని ఆశిస్తున్న-  కజకస్తాన్ బిషప్

పోప్ ఫ్రాన్సిస్ పర్యటన  శాంతి కి దోహదం చేస్తుందని ఆశిస్తున్న-  కజకస్తాన్ బిషప్

అపోస్టోలిక్ యాత్ర లో భాగం గా "సివిల్ మరియు చర్చి అధికారుల ఆహ్వానాన్ని అంగీకరిస్తూ, పోప్ ఫ్రాన్సిస్ ఈ ఏడాది సెప్టెంబర్ 13-15 వరకు కజకిస్తాన్‌కు సందర్శిస్తున్నారు. 

ఈ పర్యటన సందర్భముగా కజకిస్తాన్‌, కరాగాండాకు చెందిన బిషప్ అడెలియో డెల్'ఓరో మాట్లాడుతూ " పోప్ ఫ్రాన్సిస్ గారి పర్యటన శాంతి, సంఘీభావానికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కజకస్తాన్ లో ప్రజలు పొప్ ఫ్రాన్సిస్  కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పోప్ కు చెప్పానని, దానికి సమాధానంగా పోప్ తాను ఆ దేశాన్ని సందర్శిస్తానని తన కోరికను ఇదివరకే వ్యక్తం చేశాడని బిషప్  చెప్పారు.

16 డిసెంబర్ 1991న, కజకిస్తాన్ మాజీ సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్య్రం  పొందింది.దేశంలో కనీసం 70% ముస్లింలు మరియు దాదాపు 25% క్రైస్తవులు ఉన్నారు, వీరిలో 1% కంటే తక్కువ మంది కాథలిక్‌లు ఉన్నారు. 

కెనడా అపోస్టోలిక్ సందర్శన నుండి తిరుగు ప్రయాణంలో, పోప్ కజకిస్తాన్‌ వెళ్లాలనే తన ఆశను పునరుద్ఘాటించారు.పోప్ యొక్క రాబోయే పర్యటన కజకస్తాన్ రాజధాని నూర్-సుల్తాన్ లో జరుగుతున్న ప్రపంచ మరియు సంప్రదాయ మతాల నాయకుల నాయకుల ఏడవ మహాసభ సందర్భంగా కజకిస్తాన్ లో ఆయన పాల్గొంటారు.

Add new comment

1 + 0 =