పోప్ ఫ్రాన్సిస్ గారు సెప్టెంబరులో కజకిస్తాన్‌ను సందర్శించనున్నారు

 పోప్ ఫ్రాన్సిస్ గారు సెప్టెంబరులో కజకిస్తాన్‌ను సందర్శించనున్నారు

సోమవారం ఒక ప్రకటనలో, హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మాటియో బ్రూనీ ఇలా ప్రకటించారు: అపోస్టోలిక్ యాత్ర లో భాగం గా "సివిల్ మరియు చర్చి అధికారుల ఆహ్వానాన్ని అంగీకరిస్తూ, పోప్ ఫ్రాన్సిస్ ఈ ఏడాది సెప్టెంబర్ 13-15 వరకు కజకిస్తాన్‌కు సందర్శిస్తారు.అలాగే  నూర్-సుల్తాన్ నగరాన్నికూడా సందర్శించనున్నారు.

ప్రతి మూడు సంవత్సరాలకు, నూర్-సుల్తాన్‌లో జరిగే ప్రపంచ మరియు సాంప్రదాయ మతాల కాంగ్రెస్‌ నాయకుల  సమావేశానికి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత పెద్దలు హాజరువుతారు.

కెనడా అపోస్టోలిక్ సందర్శన నుండి తిరుగు ప్రయాణంలో, పోప్ కజకిస్తాన్‌ వెళ్లాలనే తన ఆశను పునరుద్ఘాటించారు.

16 డిసెంబర్ 1991న, కజకిస్తాన్ మాజీ సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్య్రం  పొందింది.దేశంలో కనీసం 70% ముస్లింలు మరియు దాదాపు 25% క్రైస్తవులు ఉన్నారు, వీరిలో 1% కంటే తక్కువ మంది కాథలిక్‌లు ఉన్నారు.

Add new comment

2 + 1 =