పోప్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కాథోలిక  శ్రీసభ నాయకుడిని "పోప్" అని పిలుస్తాము . యేసు ప్రభువు శిష్యుడు అయిన  పునీత  పేతురు గారికి వారసుడిగా  పోపు గారిని  శ్రీసభ ఎన్నుకొంటుంది .
 యేసు ప్రభువు  పేతురు తో  ఇట్లనెను  "నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో,అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో,
అది పరలోకమందును విప్పబడును"(మత్తయి 16:18,19) అని సెలవిచ్చారు.

ఉత్ధానమైన పిదప క్రీస్తుప్రభువు మరల పేతురు గారితో-: యోహాను పుత్రుడవైన సీమోను నీవు నన్ను వీరందరి కంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు గారు" అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు" అని సమాధానమిచ్చెను.
"యోహాను పుత్రుడవైన సీమోను! నీవు నన్ను ప్రేమించుచున్నావా?" అని క్రీస్తు ప్రభువు రెండవ పర్యాయము అతనిని అడిగెను."అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు
ఎరుగుదువు" అని పేతురు గారు బదులు చెప్పెను.
"నా గొర్రెలను కాయుము"( యోహాను 21:15-16) అని ప్రభువు
ఆజ్ఞాపించారు. అందుకే పోపు గారిని మనమంతా కూడా "క్రీస్తుదూత"అని కూడా భావిస్తున్నాము. పోపు గారి ఆధిక్యత కతోలిక శ్రీసభలో అందరి చేత అంగీకరింపబడుతున్నది . పోపు
గారికి శ్రీసభ సభ్యులకు బోధించి పరిపాలించు అధికారము కలదు ఈరోజు మన ఆధ్యాత్మిక తండ్రి పోపు గారు తన యొక్క  83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన సమయంలో మనమంతా ఆయన కొరకు ప్రార్థన చేద్దాం , అదేవిధంగా  పోప్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం ఆమెన్.

Add new comment

14 + 3 =