పేద ప్రజలకు అండగా హైదరాబాద్ అతిమేత్రాసన సాంఘిక సేవ సంస్థ (HASSS)

హైదరాబాద్, సెయింట్ మేరీస్ బెసలికా నందు  "ఆశ్రయం - హ్యాండ్ అఫ్ హోప్" వారు 23 జులై 2022 శనివారం నాడు ఉచిత వైద్య శిబిర సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

హైదరాబాద్ అతిమేత్రాసన సాంఘిక సేవ సంస్థ (HASSS) వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి 
Msgr వై బాలశౌరి గారు, సెయింట్ మేరీస్ విచారణ గురువులు గురుశ్రీ ఎం ఆరోగ్యం గారు, గురుశ్రీ విక్టర్ ఇమ్మానుయేల్ (ఛాన్సలర్) మరియు HASSS డైరెక్టర్ గురుశ్రీ మాదాను అంతోని గారు హాజరై ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 18 రకాల రక్త పరీక్షలు, కంటి పరీక్ష, దంత పరీక్ష, X - Ray, ECG, రక్తపోటు పరీక్ష వంటివి నిర్వహించారు.  

హైదరాబాద్ అతిమేత్రాసన సాంఘిక సేవ సంస్థ (HASSS) వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు అభినందిస్తున్నారు.

Add new comment

1 + 7 =