పేద ప్రజలకు అండగా విన్సెంట్ డి పాల్ సంస్థ || సెయింట్ ఆంథోనీ చర్చ్, విశాఖపట్నం కౌన్సిల్

కొనసాగుతున్న విన్సెంట్ డి పాల్  సొసైటీ  సేవలు :
 సెయింట్ ఆంథోనీ చర్చ్, విశాఖపట్నం కౌన్సిల్ వారు విచారణ గురువులు రేవ్ .ఫాదర్ .D.బాలశౌరి  గారి చేతుల మీదుగా పేద ప్రజలకు దుప్పట్లు ,చీరలు  పంచడం జరిగినది .వారికీ చేయూత ఇవ్వడంతోపాటు భవిష్యత్‌లో వారి కాళ్లమీద వారు నిలబడేలా విన్సన్ట్ డి పాల్  సొసైటీ  వారు వారికి  సహాయమును అందిస్తున్నారు .
ప్రెసిడెంట్ నిర్మల మేరీ గారు మాట్లాడుతూ " నిజ క్రైస్తువునికి ప్రతి రోజు క్రిస్ట్మస్ (క్రీస్తుని ఆరాధించడమే ) " అని ,ప్రభు యేసు చూపిన మార్గంలో పేదప్రజలకు ఎల్లప్పుడు "విన్సన్ట్ డి పాల్  సొసైటీ" అండగా ఉంటుందని తెలిపారు .
" విన్సెంట్ డి పాల్ " నుండి అశోక్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ చేయాలనీ , సేవ చేయడానికి డబ్బులు అవసరం లేదని ,దృఢసంకల్పం ,మంచి మనసు ఉంటే చాలని అన్నారు .
అన్నపూర్ణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రభు యేసు మార్గములో నడవాలని  సూచించారు .

విశాఖపట్నం  సెంట్రల్  కౌన్సిల్  అధ్యక్షులు " శ్రీ రామరావు " గారు " విన్సెంట్ డి పాల్ "  ప్రెసిడెంట్ మరియు  మిగతా సభ్యులకు అభినందలు తెలిపారు . క్రీస్తుని సేవలో ముందుకు వెళ్లాలని సూచించారు .

Add new comment

7 + 3 =