పేదలతో నా యాత్ర

కీర్తి శేషులు గురుశ్రీ రేమండ్ అంబ్రోస్పేదలతో నా యాత్ర

పేదలతో నా యాత్ర ( My Pilgrimage with the Poor ) అనే పుస్తకాన్ని 06 జులై 2022 న హోమ్ ఫర్ ది డిస్ఏబుల్డ్ లో హైద్రాబాద్ అగ్రపీఠాధిపతి మరియు కార్డినల్ గా ప్రకటింపబడ్డ మహా పూజ్య పూల అంతోని  గారు ఆవిష్కరించారు.

కీర్తి శేషులు గురుశ్రీ రేమండ్ అంబ్రోస్ గారు జీవించి ఉండగా తన అనుభవాలను, తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా ఆయన రాసుకున్న స్వీయ గాధను పుస్తక రూపంలో పొందుపరచి, దానిని ప్రచురించడం జరిగింది.

హోమ్ ఫర్ ది డిస్ఏబుల్డ్ డైరెక్టర్ గురుశ్రీ జేవియర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 
 
కార్యక్రమంలో మహా పూజ్య పూల అంతోని గారు మాట్లాడుతూ గురుశ్రీ రేమండ్ గారు తమిళనాడు లో జన్మించినా తెలుగు కథోలిక విశ్వాసులకు, తెలుగు శ్రీసభకు ఆయన చేసిన సేవ అనిర్వచనీయమని, గురువులు మాత్రమే కాకుండా ప్రతిఒక్క క్రైస్తవ విశ్వాసి ఆయనను ఆదర్శంగా తీసుకొని కథోలిక సమాజానికి తమ వంతు సేవ చెయ్యాలని తద్వారా దేవుని దీవెనలు పొందాలని కోరారు.

ఈ కార్యక్రమానికి టుటికోరన్ విశ్రాంత పీఠాధిపతి, గురుశ్రీ రేమండ్ అంబ్రోస్ గారి సహోదరుడైన మహా పూజ్య ఎవోన్ అంబ్రోస్ గారు కూడా హాజరైయ్యారు.  

Add new comment

1 + 4 =