పునీత దేవసహాయం పిళ్ళై గారి సమాధి వద్ద కృతజ్ఞతా సమర్పణ ప్రార్థన

మహా పూజ్య. ఫిలిప్ నేరిపునీత దేవసహాయం పిళ్ళై

పునీత దేవసహాయం పిళ్ళై గారి సమాధి వద్ద కృతజ్ఞతా సమర్పణ ప్రార్థన సేవ శుక్రవారం, 24 జూన్ 2022  న జరుగుతుందని గోవా అగ్రపీఠాధిపతులు, CCBI అధ్యక్షులు అయిన మహా పూజ్య. ఫిలిప్ నేరి గారు దేశ విశ్వాసులందరికి ఒక అధికారిక లేఖ ద్వారా తెలియజేసారు.

24 జూన్ 2022 న క్రీస్తు తిరు హృదయ పండుగ సందర్భంగా మన కుటుంబాలను యేసు పవిత్ర హృదయానికి సమర్పిస్తూ, రాత్రి 8.౩౦ గంటల నుండి 9.30  గంటల వరకు జరిగే ఈ ప్రార్ధనా సమావేశంలో అందరు పాల్గొనాలని ఆయన ఆహ్వానిస్తున్నారు.

ఈ కార్యక్రమం దేశంలోని అన్ని ప్రముఖ కథోలిక టీవీ ఛానళ్లలో ప్రసరమౌతుందని మరియు అన్ని సామాజిక మాధ్యమాలలో ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
 
విచారణ గురువులందరు వారి వారి విచారణలలోని విశ్వాసులకు ఈ సమాచారాన్ని అందించి వారందరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించాలని ఆయన కోరారు. 

ఈ ప్రార్ధన ద్వారా అందరం ఒకే కుటుంబంగా ప్రార్ధించవచ్చని మరియు విశ్వాస వీరుడైన పునీత దేవసహాయం గారి మధ్యవర్తిత్వం కోసం అభ్యర్ధించవచ్చని ఆయన అన్నారు.

Add new comment

1 + 0 =