పునీత దేవసహాయం పిళ్ళై గారి సమాధి వద్ద కృతజ్ఞతా సమర్పణ దివ్యబలిపూజ

చెన్నై, కొట్టర్ మేత్రాసనం, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి కథెడ్రల్ దేవాలయంలో జూన్ 24 2022 శుక్రవారం రోజున సాయంత్రం 8:30గం|| నుండి 9:30గం|| వరకు పునీత దేవసహాయం పిళ్ళై గారి సమాధి వద్ద భారతదేశంలోని కుటుంబాలన్నిటిని యేసు పవిత్ర హృదయానికి అంకితం చేసే కృతజ్ఞతా దివ్యబలి పూజను కార్డినల్, నున్షియో, అగ్రపీఠాధిపతులు, భారతదేశం లోని విశ్వాసులందరి సమక్షంలో సమర్పించారు.

 

కార్డినల్ మహా పూజ్య ఓస్వాల్డ్ గ్రేషస్ ముంబై అగ్రపీఠాధిపతులు, నేపాల్ మరియు భారతదేశ అపోస్టోలిక్ పాపుగారి రాయబారి(నున్షియో) లియోపోల్డో జెరెల్లి గారు దివ్యసత్ప్రసాద ఆరాధన సమర్పణను, కార్డినల్ గా ఎన్నికైన గోవా అతిమేత్రానులు మహా ఘన ఫిలిపె నేరి ఫెర్రాఓ , CCBI కార్యదర్శి మహా పూజ్య అనిల్ జోసఫ్ థామస్ కౌటో, ఢిల్లీ అతిమేత్రానులు, మహా పూజ్య జార్జ్ ఆంథోని పప్పుసామి,మధురై అతిమేత్రానులు, మహా పూజ్య థామస్ జె నెట్టో, త్రివాండ్రమ్ అతిమేత్రానులు, మహా పూజ్య నాజారేనే సూసై, కొట్టర్ మేత్రానులు, దేవసహాయం పిళ్ళై గారిని పునీతులుగా తెలియజేసిన ఉపప్రతిపాదకులు గురుశ్రీ జాన్ కుళందై గారు,CCBI కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ యేసుకరుణానిధిగారు, CCBI ఉపకార్యదర్శి గురుశ్రీ స్టీఫెన్ అళతారా గారు, కథెడ్రల్ రెక్టర్ గురుశ్రీ స్టాన్లీ సహాయ గారు మరియు సరళ్ విచారణ గురువులు గురుశ్రీ జాన్ సిబి గార్లు అంతా కలిసి దేశంలోని కుటుంబాలన్నిటిని యేసు పవిత్ర హృదయానికి అంకితం చేసి కృతజ్ఞతా దివ్యబలి పూజను సమర్పించారు.

 

ఈ పూజలో కొట్టర్ మేత్రాసనంలోని లూర్దుమాత దేవాలయ విచారణ గాయక బృందం వారు పూజ భక్తి గీతాలను మధురంగా ఆలపించారు. ఈ దివ్యపూజను దేశంలోని అన్ని ప్రముఖ కథోలిక టీవీ మరియు యూట్యూబ్ ఛానెళ్లలోప్రసారం చేయబడింది. తెలుగు రాష్ట్రాలనుంచి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది తెలుగు విశ్వాసులు దివ్యబలిపూజ కార్యక్రమాన్ని వీక్షించారు. చెన్నైలోని కృతజ్ఞతా దివ్యబలిపూజకు విశ్వాసులు అధికసంఖ్యలో హాజరయ్యారు.  

Add new comment

4 + 12 =