పునీత చిన్న తెరేసమ్మ గారి దేవాలయం ప్రారంభోత్సవం

విశాఖ అతి మేత్రాసనం, యర్ర సామంతవలస  గిరిజన విచారణ లో జోడి మామిడి గ్రామం లో పునీత చిన్న తెరేసమ్మ గారి దేవాలయం ప్రారంభోత్సవం ఘనం గా జరిగింది.  విశాఖ అతి మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్ర సామంతవలస విచారణ కర్తలు  గురుశ్రీ పువ్వుల  జీవన్ బాబు గారి ఆద్వర్యం లో దేవాలయం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ముఖ్య అథితిగా పాల్గొని నూతన దేవాలయాన్ని ఆశీర్వదించారు. మహారాణిపేట విచారణ గురువులు  గురుశ్రీ డి బాలశౌరి, గురుశ్రీ జాన్ ప్రకాష్ ,గురుశ్రీ రాజ కుమార్, గురుశ్రీ జోసెఫ్ , బొబ్బిలి విచారణ గురువులు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ ,గురుశ్రీ పీటర్, గురుశ్రీ వేలాంగణి,  గురుశ్రీ రాజేంద్ర ,గురుశ్రీ సైమన్ తో పాటు ఇతర గురువులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో గురువులతో పాటు సిస్టర్స్, విశ్వాసులు, విచారం ప్రజలు ,యువతీ యువకులు పాల్గొన్నారు.  

గురుశ్రీ పువ్వుల  జీవన్ బాబు గారు మాట్లాడుతూ చిన్న తెరేసమ్మ గారి స్వరూపం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలదని ,ఈ పునీతరాలి బంధువులే ఈ స్వరూపాన్ని మిషనరీ గురువులకు ఇచ్చారని తెలిపారు.1927  సంవత్సరం లో ఇక్కడ  స్థాపించడం జరిగినదని తెలిపారు. దేవాలయ ప్రారంభోత్సవానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక  ధన్యవాదాలు తెలిపారు.

Add new comment

6 + 7 =