పునీత చిన్న తెరేసమ్మ గారి ఉత్సవాన్ని కొనియాడిన నెల్లూరు మేత్రాసనం

నెల్లూరు మేత్రాసనం, సెయింట్ జోసఫ్ కథిడ్రల్ నందు అక్టోబర్ 1, 2022న తమ మేత్రాసన  పాలక పునీతురాలైన చిన్న తెరేసమ్మ గారి ఉత్సవాన్ని ఘనంగా కొనియాడారు.

నెల్లూరు మేత్రానులు మహా పూజ్య దొరబోయిన మోసిస్ ప్రకాశం తండ్రి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి ఇతర మేత్రాసన గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు.

ఈ పండుగ పూజకు సుమారు 40 మంది గురువులు, 100 మంది మఠకన్యలు, 500 మందికి పైగా విశ్వాసులు హాజరైయ్యారని సెయింట్ జోసఫ్ కథిడ్రల్ విచారణ కర్తలు జార్జ్ విలియం గారు తెలిపారు.

విచారణ కర్తలు గురుశ్రీ జార్జ్ విలియం గారు విచేసిన పీఠాధిపతులవారిని, గురువులను, పండుగ నిర్వహులకు, గాయక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Add new comment

7 + 4 =