పునీత అంథోని వారి పతాక ఆవిష్కరణ చేసిన వరంగల్ పీఠకాపరి

పునీత అంథోని వారి దేవాలయంమెట్టుగూడ, పునీత అంథోని వారి దేవాలయం

జూన్ 13 న పునీత అంథోని వారి పండుగ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్, మెట్టుగూడ లోని పునీత అంథోని వారి దేవాలయంలో 01 జూన్ 2022 న పునీత అంథోని వారి పతాక ఆవిష్కరణ దివ్యబలిపూజ జరిగింది. వరంగల్ పీఠకాపరి మహా పూజ్య. ఉడుమల బాల గారు ఈ దివ్యబలిపూజను అర్పించి, పునీత అంథోని వారి పతాకాన్ని ఆవిష్కరించారు. 

మహా పూజ్య. ఉడుమల బాల గారు ప్రసంగిస్తూ, ప్రార్ధనా జీవితం గురించి విశ్వాసులకు వివరించారు. పునీత అంథోని వారి పరిశుద్ధ ప్రార్ధనా జీవితమే ఆయనను దేవునికి ప్రియమైన వ్యక్తిగా చేసిందని, విశ్వాసులందరు కూడా పునీత అంథోని వారి అడుగుజాడలలో నడవాలని కోరారు.

01 జూన్ 2022  నుండి పునీత అంథోని వారి పండుగ రోజు వరకు జరుగబోయే ప్రత్యేక అంథోని వారి ప్రార్థనలను పూజ్య తండ్రిగారు ప్రారంభించారు. విశ్వాసులందరు అంథోని వారి నావాడిని ప్రార్థనలలో పాల్గొనాలని తండ్రిగారు విశ్వాసులకు పిలుపునిచ్చారు.

Add new comment

3 + 0 =