పునీత అంథోని వారి నవదిన ప్రార్థనలు మొదలయ్యాయి

విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ  పునీత అంథోని వారి పుణ్యక్షేత్రం లో  నవదిన ప్రార్థనలు 31  మే 2022  న మొదలయ్యాయి.  "పునీత అంథోని వారి దేవాలయ" ప్రాగణంలో ఉన్న పండుగ  జెండా ఆవిష్కరణను విశాఖ అగ్రపీఠ ఆధ్యాత్మిక ప్రసంగికులు గురుశ్రీ పసుపులేటి యుగళ్ కుమార్ గారి చేతులమీదుగా జరిగింది. విశాఖ అతి మేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ గురువులు   గురుశ్రీ డి బాల శౌరి గారి  ఆద్వర్యం లో ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి.  విచారణ ప్రజలతో  పాటూ వివిధ ప్రాతాలనుండి భక్తులు రావడం జరిగినది. యువతీ యువకులు  దేవాలయాన్ని కన్నుల పండుగగా తయారు చేసారు. జూన్ 13 న  పునీత అంథోని వారి పండుగ జరగనున్నది.ప్రజలందరూ  భక్తి శ్రద్ధలతో ఈ నవదిన ప్రార్థనలులో పాల్గొనాలని విచారణ కర్తలు సూచించారు.

 

Add new comment

4 + 2 =