పునీత అంతోని వారి వార్షిక మహోత్సవం.

12  జూన్ 2022 న, గుంటూర మేత్రాసనం, నగరంపాలెం, పునీత అంతోని వారి వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. 

ఆదిలాబాద్ మేత్రాణులు మహా పూజ్య అంతోని ప్రిన్స్ పన్నన్ గాడన్ తండ్రిగారు, గుంటూరు మేత్రాసన గురువులు సమిష్టి దివ్యబలిపూజను అర్పించారు.

అదిలాబాద్ మేత్రాణులవారు దైవవాక్కును బోధిస్తూ "యేసు ప్రభువుకు పునీతులకు ఉన్న వ్యత్యాసాన్ని" స్పష్టంగా విశ్వాసులకు బోధించారు.  

"పునీత అంథోని వారిని మధ్యవర్తిత్వం శక్తివంతమైనది, వారి ప్రార్థన సహాయము ద్వారా మనం ప్రభువుకు ఇంకా దగ్గర కావచ్చు" అని అన్నారు. 

పూజానంతరం అదిలాబాద్ మేత్రాణులవారిని ఆ విచారణ కౌన్సిల్ సభ్యులు గజ్జ మాలతోను శాలువాలతోను సన్మానించారు.

ఈ పండుగ పూజకు విచ్చేసిన ప్రియతమ అదిలాబాద్ మేత్రానులుకు, గురువులకు, మఠవాసులకు మరియు విచారణ విశ్వాసులకు ఆ విచారణ గురువైన గురుశ్రీ పెంటారెడ్డి రాజారెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు.

గుంటూరు మేత్రాసనం విశ్వాస పధంలో ముందుకు సాగాలని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను మరియు విశ్వాసులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు దేవుని ప్రార్థిస్తున్నారు.
 

Add new comment

3 + 0 =