పునీతులుగా ప్రకటించబడనున్న మరో ముగ్గురు.

New saints
మరో ముగ్గురిని పునీతులుగా ప్రకటించనున్న ఫ్రాన్సిస్ పాపు గారు

పునీతులుగా ప్రకటించబడనున్న మరో ముగ్గురు.

 

కాసెస్ అఫ్ సెయింట్స్ సభ వారు విడుదల చేసిన క్రొత్త ఉత్తరువులకు ఫ్రాన్సిస్ పాపు గారు ఆమోద ముద్ర వేశారు. ఈ ఉత్తరువుల ప్రకారం త్వరలో ముగ్గురు వ్యక్తులను పునీతులుగా ప్రకటించనున్నారు.

వీరిలో మొదటి వ్యక్తి వెనిజులా కు చెందిన జోస్ గ్రెగొరీయో హెర్నాండెజ్ అనే ఒక వైద్యుడు. ఒక కథోలికుడై ఉంది సమాజానికి ఆయన చేసిన అపారమైన సేవకు గాను ఆయనను పునీతునిగా ప్రకటించనున్నారు. ఈయన 1919 లో మరణించారు. వెనిజులా నుండి పునీతుడు కానున్న మొట్టమొదటి వ్యక్తి ఈయనే.

రెండవ వ్యక్తి ఆర్జెంటినా కు చెందిన మామెర్టో ఎస్ క్వియూ అనే ఒక పీఠాధిపతి. యుద్ధ సమయంలో ఐక్యతను చాటిన వ్యక్తిగా ఈయన ప్రసిద్ధులు. ఈయన 1880 లో మృతి చెందారు.

ఇక మూడవ వ్యక్తి  జెర్మనీ కి చందిన జువాన్ బౌటిస్తా జోర్డాన్ అనే ఒక గురువు. ఈయన డివైన్  సేవిర్ అనే సభను స్థాపించి, ఎందరో యువకులను క్రీస్తు సేవలోనికి నడిపించారు.

వీరు కాక, ఇటలీ కి చెందిన మరియా లౌర మైనెట్టి అనే ఒక కన్యస్త్రీకి గౌరవ "బ్లెస్సెడ్"హోదా ను కూడా ప్రకటించారు. 2000 సంవత్సరంలో ఈమె సాతాను ఆరాధకులకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు.

Add new comment

10 + 1 =