పార్వతీపురంటౌన్ విచారణ తిరుకుటుంబ దేవాలయ మహోత్సవాలు

శ్రీకాకుళం మేత్రాసనం, పార్వతీపురంటౌన్ విచారణలో మే 15,2022 ఆదివారం రోజున తిరుకుటుంబ దేవాలయ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.   శ్రీకాకుళ మేత్రానులు మహా ఘన రాయరాలా విజయ్ కుమార్ తండ్రిగారు సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.
దివ్యపూజలో తండ్రిగారు పునీతులైన దేవసహాయం పిళ్ళై గారి విశ్వాసాన్ని , క్రైస్తవ జీవితంలో కుటుంబానికి ఉండే విలువలను గూర్చి తెలియజేశారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.
విచారం గురువులు గురుశ్రీ వినోద్ కుమార్ గారు మరియు సహాయక గురువులు గురుశ్రీ మరియదాసు గారు పూజాబలిని సమర్పించిన తండ్రిగారికి గారికి, పండుగ పూజకు విచ్చేసిన గురువులకు, మఠకన్యలకు, విశ్వాసులకు, విచారణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Add new comment

7 + 3 =