పాపు గారిని కలుసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని 22 జూన్ 2022 బుధవారం రోజున ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ గారు రోమ్ లోని వాటికన్ నగరంలో కలుసుకున్నారు. శ్రీ నవీన్ పట్నాయక్ గారు రోమ్ నగరంలో ప్రపంచ ఆహార కార్యక్రమంలో (World Food Programme) పాల్గొనడానికి వచ్చారని అదే సమయంలో పాపు గారిని కలుసుకునే అవకాశం వచ్చిందని అది ఎంతో సంతోషకరమని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ గారు ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన 'పత్తాచిత్ర' అనే చిత్రపఠాన్నిపాపుగారికి బహుకరించారు.

 పత్తాచిత్ర చిత్రపఠం జీవితం యొక్క చెట్టును వర్ణిస్తుంది.  పత్తచిత్రం ఒక పురాతనమైన,  సంప్రదాయకమైన, అపురూపమైన, వస్త్రం ఆధారంగా గీయబడిన ఒక చిత్రపఠం. ఈ కళారూపం క్లిష్టమైన అంతర్గత వివరాలకు, ప్రకృతిలోని రంగులకు, పౌరాణిక ఇతివృత్తాలకు  ప్రసిద్ధి గాంచింది. ఈ చిత్రపఠం ఒడిశాలోని అపురూపమైన కళా నిపుణులను, నైపుణ్యం కలిగిన చేతిపనుల వ్యక్తులను సూచిస్తుంది. పరిశుద్ధ పాపు గారి విలువైన సమయాన్ని తన కోసం వెచ్చించినందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ గారు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వందనాలు సమర్పించారు. 

Add new comment

2 + 0 =