పరిశుద్ధ లూర్ధుమాత నవదిన ప్రార్ధనలు ప్రారంభం

కర్నూలు మేత్రాసణ పాలకురాలైన పరిశుద్ధ లూర్ధుమాత వార్షికోత్సవం సందర్భంగా గురుశ్రీ సిద్దిపోగుల దేవదాసు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 ,2023 న నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. 

కర్నూలు డీన్, కో కథిడ్రల్ విచారణ గురువులు గురుశ్రీ కాకర్ల అంతోనిరాజు గారు పతాకావిష్కరణగావించి నవదిన ప్రార్థనలు ప్రారంభించి, దివ్యపూజాబలి సమర్పించారు. 

ఈ సందర్భంగా విశ్వాసులు మరియతల్లి స్వరూపాన్ని పల్లకీలో ఉంచి కథిడ్రల్ చుట్టూ జపమాల జపిస్తూ ప్రదక్షిణ నిర్వహించారు. 

ఈ సందర్భంగా గురుశ్రీ కాకర్ల అంతోనిరాజు దైవసందేశమందిస్తూ "మరియతల్లి లోక రక్షకునికి జన్మనిచ్చి రక్షణమాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. లోక రక్షకునికి తల్లి అయినా కూడా వినమ్ర హృదయంతో జీవించారని, ప్రతి ఒక్కరు ఆ తల్లిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు". 

కథిడ్రల్ ఆవరణలోని లూర్ధుమాత గుహవద్ద దివ్యపూజాబలి లో మేత్రాసణ ప్రొక్యురేటర్ గురుశ్రీ ఓ. జోజిరెడ్డి, కే.డీ.యస్.యస్.యస్  డైరెక్టర్ గురుశ్రీ సుధాకర్, కోవెలకుంట్ల విచారణ కర్త గురుశ్రీ కొమ్ము లూర్ధు, ఓర్వకల్లు విచారణ కర్త గురుశ్రీ ఆనంద్, గురుశ్రీ ప్రవీణ్, గురుశ్రీ బాబు మరియు గురుశ్రీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Add new comment

4 + 6 =