పరిశుద్ధ లూర్దుమాత మహోత్సవం, మరియాపురం, కడప మేత్రాసనం

కడప మేత్రాసనం, మరియాపురం, సెయింట్ మేరీస్ కథిడ్రల్ ఆవరణంలో  11 ఫిబ్రవరి 2022 న పరిశుద్ధ లూర్దుమాత మహోత్సవం జరిగింది. కడప అపోస్టిలిక్ అడ్మినిస్ట్రేటర్ మహా పూజ్య గాలి బాలి తండ్రిగారు, మేత్రాసన గురువులు కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు.

ఈ దివ్యబలి పూజలో వేలాదిమంది భక్తులు సంతోషంగా దివ్యబలిపూజ, ఊరేగింపులో పాల్గొని తమ కానుకలు సమర్పించి మరియ తల్లి ఆసిషులు పొందుకున్నారు. ఎద్దుల పోటీలు,వాలీ బాల్ పోటీలు,  చెక్క భజన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.

కడప మేత్రాసనాన్ని ఆ మరియ తల్లి ఎల్లప్పుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

4 + 12 =