పన్నులను ఎగవెయ్యడం, పన్నులు కట్టకుండా తప్పించుకోవడం కూడా పాపహేతువులే: ఫ్రాన్సిస్ పాపు గారు.

Tax cuts for the rich and tax havens are structures of sin
Tax cuts for the rich and tax havens are structures of sin

పన్నులను ఎగవెయ్యడం, పన్నులు కట్టకుండా తప్పించుకోవడం కూడా పాపహేతువులే: ఫ్రాన్సిస్ పాపు గారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధుల శాఖ అధ్యక్షునితో మరియు పలు దేశాల ఆర్ధిక మంత్రులతో ఫ్రాన్సిస్ పాపు గారు గత బుధవారం సమావేశం అయ్యారు.

కొందరు సంపన్నులు లోభితనంతో తమ సంపదను ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతూఉంటే మనం చేతులు ముడుచుకొని కూర్చోకూడదు అని ఘాటుగా స్పందించారు.

ఈ సమస్యలను మనం పరిష్కరించుకోగలం ఎందుకంటే ఇవి వనరులు కొరత వలన వచ్చిన సమస్యలు కావు. సార్వత్రిక అసమానతను ప్రతిఘటించడానికి దృఢ సంకల్పం కనిపించడంలేదు.  అని పాపు గారు అభిప్రాయపడ్డారు.

"ఇది మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరు దృఢంగా ఈ సమస్యను ఎదుర్కొని పరిష్కారం కోసం కృషి చెయ్యాలి. అత్యంత సంపన్నత మధ్య అత్యంత దారిద్య్రం కనిపిస్తే దానికి ఆస్కారం ఇచ్చింది మనమే" అని ఆయన అన్నారు.

నేటి సమాజంలో సంక్షేమ పథకాలు కొందరికే వర్తిస్తున్నాయని, ఆర్ధిక సంస్థలు, ప్రభుత్వాలు అందరి సంక్షేమం కోసం, సమగ్ర అభివృద్ధికి పాటుపడడం ద్వారా అవి పాపహేతువులు కాకుండా ఉండగలవని,  పాపు గారు చెప్పారు.

పెట్టుబడులు, అభివృద్ధి అను నెపంతో పన్నులు ఎగవెయ్యడం, ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు దొడ్డి దారిలో పన్నులు కట్టకుండా తప్పించుకోవడం, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని కొందరు ధనికులు పన్నులు కట్టకపోవడం వంటివి నేటి సమాజంలో పాపహేతువులు అని ఆయన వివరించారు.

చివరిగా, మానవతా విలువలను పరిరక్షించే విధంగా, ప్రజల ఆర్ధిక సమస్యలను మానవతా దృక్పధంతో చూసేవిధంగా ఆర్ధిక సంస్కరణ తప్పక జరగాలని పాపు గారు ఆకాంక్షించారు.

Add new comment

2 + 2 =