నేషనల్ యూత్ సండే |st.claret youth |Kailasapuram, visakhapatnam

 ఈరోజు  " వేలాంగణి మాత చర్చ్ " లో  నేషనల్ యూత్ సండే  వేడుకలు ఘనముగా జరిగాయి .రేవ్ ఫాదర్ సేవి  మరియు ఫాదర్ జెస్సిన్ ఆధ్వర్యములో యూత్ వారి కొరకు ప్రత్యేక దివ్యబలిపూజ ను సమర్పించడం జరిగినది . ఎప్పటిలాగే యూత్ వారు అందరు వారి వారి బైబిల్ లతో వచ్చి పాల్గొనిరి. యువతకి మార్గదర్శి గా ,  వారు చేసే మంచి పనులందు వారికీ ఎల్లప్పుడు తోడుగా వుంటూ , యువతను జీసస్ యూత్ గా ముందుకు నడిపిస్తున్నటువంటి యూత్  యానిమేటర్ " ఫ్రాంకీ " గారి  ఆధ్వర్యములో యువత  పాటలతో దేవుని స్థుతిస్తు ఈ  దివ్యబలి పూజలో పాల్గొన్నారు . తరువాత జరిగినటువంటి యువత కార్యక్రమాలలో యూత్ ప్రెసిడెంట్  శామ్యూల్ ఆధ్వర్యములో  ఆటలు  మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో  ఘనముగా ముగిసాయి .ఫాదర్ గారు  యూత్ వారి కొరకు లంచ్ ను ఏర్పాటు చేయడం జరిగినది . యూత్ నుండి ప్రశాంతి మాట్లాడుతూ ఫాదర్ సేవి (Rev.Fr.SEVI) గారు  యూత్ వారి కొరకు ప్రత్యేక శ్రద్ద వహిస్తూ , యువతని  ఆధ్యాత్మికంగా దేవుని యందు  బలపరుస్తున్నారని ,నిజ తండ్రి  దేవుని ప్రేమ ఎటువంటిదో  ఫాదర్ గారు తెలియజేసారని  తెలిపినది .

Add new comment

2 + 6 =