నేపాల్లో మరియతల్లి మోక్షారోహణ మహోత్సవం

నేపాల్‌లోని కథోలిక విశ్వాసులు ఆగస్టు 13న ఖాట్మండు, ధోబీఘాట్-లలిత్‌పూర్‌లోని కథెడ్రల్ దేవాలయంలో చాలా భక్తి ఉత్సాహాలతో మరియతల్లి మోక్షారోహణ మహోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

మహోత్సవ తేదీని ఆగస్టు 15న నిర్ణయించినప్పటికీ, నేపాల్ యొక్క వారపు సెలవుదినమైన ఆగస్టు 13న మరియతల్లి మోక్షారోహణ మహోత్సవాన్ని  జరుపుకోవాలని కథెడ్రల్ నిర్ణయించిందని విచారణ గురువులు గురుశ్రీ రిచర్డ్ రాయ్ గారు తెలిపారు.

విశ్వాసులకు ఆగస్టు 15 కంటే ఆగస్ట్ 13 విందు జరుపుకోవడం చాలా సౌకర్యవంతంగా ఉన్నాడని పరిశుద్ధ కన్య మరియ కథెడ్రల్ విచారణ గురువులు తెలిపారు. దివ్యపూజలో మరియతల్లి యొక్క ఆత్మ శరీరాలను మోక్షమునకు పంపడిన గొప్పతనాన్ని, చారిత్రక ఘటాన్ని విచారణ గురువులు వివరించారు.

కథోలిక బోధన ప్రకారం, మోక్షరోహణం అంటే కన్య మరియమ్మను స్వర్గంలోకి స్వీకరించడం అని అర్ధం. ఈ మహోత్సవం 1950లో 12 పియస్ పాపు గారి ద్వారా కథోలిక శ్రీ సభకు అధికారికంగా ప్రకటించబడింది.

ఖాట్మండు విచారణలోని వివిధ రాయబార కార్యాలయాలు, ఐక్యరాజ్యసమితి సిబ్బంది మరియు వివిధ ప్రముఖ విదేశీయులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. మహోత్సవానికి దాదాపుగా 250 మందికి పైగా విశ్వాసులు మరియు అతిథులు హాజరయ్యారు.

దివ్యపూజబలి అనంతరం విచారణ యువకులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, నేపాల్ అంచనా వేసిన 29 మిలియన్ల జనాభాలో హిందువులు దాదాపు 81% ఉన్నారు, బౌద్ధులు 9%, ముస్లింలు 4.4 శాతం మరియు క్రైస్తవులు 1.4 శాతం మాత్రమే ఉన్నారు.

 

Article by

K. Chandana Pramada

RVA Telugu Service

Add new comment

8 + 5 =