నేటి నుంచి ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి |FASTAG

ఫాస్టాగ్:

1 జనవరి 2021 నుంచే ఫాస్టాగ్ విధానాన్ని అమలుచేయాలని కేంద్రం మొదట భావించింది. కానీ ఆ తర్వాత ఫిబ్రవరి 15కి దాన్ని వాయిదా వేసింది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌ను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
 ఫాస్టాగ్ అనేది ఒక బార్ కోడ్‌తో కూడిన స్టిక్కర్. వాహన రిజిస్ట్రేషన్ వివరాలు బార్‌ కోడ్‌లో  పొందుపరచబడి ఉంటాయి. దీన్ని వాహనం ముందు అద్దంపై  అతికిస్తారు.  వాహనం టోల్ గేట్ గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే స్కానింగ్ మెషీన్ బార్‌ కోడ్‌ను ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తుంది. దీంతో ఆ బార్ కోడ్‌తో అనుసంధానించబడిన డిజిటల్ వాలెట్ ఖాతా నుంచి ఆటో‌మేటిక్‌గా టోల్ చెల్లింపు జరుగుతుంది.  టోల్ గేట్ వద్ద నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.

ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాధుడు భరించాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లే జాతీయ రహదారుల్లో ప్రాంతాల్లో 21 టోల్ ప్లాజాలున్నాయి.ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

 

 

 

 

 

 

 

 

Add new comment

5 + 8 =