నేటికి కూడా ఎందరో శరణార్ధుల పరిస్థితి అగమ్యగోచరమే

MigrantsSource: Rome Reports

నేటికి కూడా ఎందరో శరణార్ధుల పరిస్థితి అగమ్యగోచరమే

 

లంపెడస దీవిని ఫ్రాన్సిస్ పాపు గారు 2013 లో మొట్టమొదటి సారి సందర్శించారు. ఆ సమయంలో వలస వెళ్లే వాళ్ళ కోసం మరియు ఐరోపా లోనికి జీవనాధారం కోసం వెళుతున్న శరణార్ధుల కోసం ప్రత్యేకంగా ప్రార్ధించారు. 

ఏడు సంవత్సరాల తర్వాత నేటికి కూడా ఎందరో శరణార్ధుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 

లిబియా నుండి స్పెయిన్ కు వెళుతున్న ఒక ఓడ మధ్యదరా సముద్రంలో ఒక చిన్న పడవలో తిరుగుతున్న 52 మంది శరణార్థులను రక్షించింది.

40 మంది పురుషులు, 12 మంది స్త్రీలు ఒక చిన్న పడవలో తిండి తిప్పలు లేకుండా సముద్రంలో అగమ్య గోచరంగా తిరుగుతూ ఉంటే, ఒక ఓడ వారిని కాపాడి, మాల్టీస్ ప్రభుత్వ చొరవతో వారు ఆ దేశంలో విడిచిపెట్ట బడ్డారు.

వారిని కనుగొన్న తర్వాత ఓడ లోని కెప్టెన్ అయిన మొహమ్మద్ షాబాన్, ఓడలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని వారికి పంచి వారి ఆకలిని తీర్చారు. 

మృగాలు తిరిగే చోటు లో నివసిస్తూ మంచి జీవితం కోసం స్వస్థలాలను విడిచి వెళ్తున్న వారిని చూసి ఎంతో  బాధగా ఉందని మొహమ్మద్ షాబాన్ అన్నారు.

సముద్రంలో భయంకర స్థితి నుండి బయట పడినా వీరి భవిష్యత్తు ఇంకా అగమ్యగోచరమే.

2020 కూడా మనకు కనిపిస్తున్న కఠిన సత్యం ఇది. మొట్టమొదటి సారి లంపెడస ను సందర్శించినప్పుడు ఫ్రాన్సిస్ పాపు గారు తాను అర్పించిన పూజాబలి లోని సందేశంలో ఈ విషయాన్నే వొక్కాణించారు. మరి ముఖ్యంగా లిబియా లోని యుద్ధ వాతావరణాన్ని తప్పించుకోవడానికి ఎందరో అమాయకులు శరణార్థులుగా ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని ఆయన గుర్తు చేసారు.

శరణార్థ శిబిరాలలో చిక్కుకున్న వారి పరిస్థితి ఎంతో దయనీయం. సముద్రాన్ని దాటాలన్న ఒక్క ఆశతోనే వీరు వస్తారు. అని ఆయన శరణార్థులను ఉద్దేశించి అన్నారు.

Add new comment

3 + 11 =