నెల్లూరు మేత్రాసనం - జ్ఞానస్నానము మరియు దివ్యసత్ప్రసాధమును స్వీకరించిన బాలబాలికలు

నెల్లూరు మేత్రాసనం, త్రిపురంతకం మండలం, మిరియంపల్లి గ్రామములో పునీత మరియ గొరెట్టి గారి పండగ రోజున (జూలై 6, 2022 ) 15 మంది జ్ఞానస్నానము మరియు 8 మంది నూతన దివ్యసత్ప్రసాధమును స్వీకరించారు. 

విచారణ గురువులు గురుశ్రీ బండి సాగర్ సంతోష్ కుమార్ MSFS సభకు చెందిన గురువులు దివ్యబలిపూజను సమర్పించి జ్ఞానస్నానము మరియు దివ్య సత్ప్రసాధము యొక్క ప్రాముఖ్యతలను బోధించారు.  

గ్రామ ఉపదేసి, సర్పంచ్ గారు, గ్రామ కతొలికులు పాల్గొన్నారు. 

బాలబాలికలకు సత్యోపదేశమును బోధించి, సిద్ధము చేసిన విచారణ ఉపదేసి శ్రీ దార జేసుదాసు గారిని విచారణ గురువులు ప్రత్యేకంగా అభినందించారు.  

దేవుని సేవలో త్రిపురంతకం విచారణ మరియు ఈ విచారణ పరిధిలో ఉన్న 18 గ్రామ కతొలికులు ఇంకా దేవుని విశ్వాసంలో ఎదగాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

1 + 0 =