నెల్లూరు పీఠంలో యేసు తిరు హృదయ మహోత్సవాలు.

నెల్లూరు మేత్రాసనం, చీమకుర్తి, ఎండ్లూరు విచారణ యందు 26 జూన్ 2022 న యేసు తిరు హృదయ మహోత్సవము ఘనంగా జరిగాయి.

ఈ మహోత్సవంలో భాగంగా 24 జూన్ 2022 న ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్మయి సంస్థ కార్యదర్శి  గురుశ్రీ మాదాను అంథోని గారిచే యేసు తిరు హృదయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

గురుశ్రీ ఇల్లూరు హృదయరాజు-డీన్ (ఒంగోలు డీనరీ) మరియు విచారణ విశ్వాసులచే 25 జూన్ 2022 న ఎండ్లూరు గ్రామంలో తేరు ఊరేగింపు జరిగింది.

నెల్లూరు వికార్ జనరల్ గురుశ్రీ పిడతల జోసఫ్ గారు పండగ దివ్యబలి పూజ సమర్పించి యేసు తిరు హృదయ త్యాగాన్ని గురించి ప్రసంగించారు.

ఈ దివ్యబలి పూజలో నాలుగు సుబ్స్టేషన్స్ నుంచి సుమారు 300 మందికి పైగా విశ్వాసులు పాల్గొన్నారు.

విచారణ కర్తలు గురుశ్రీ మూల దేవదాస్ గారు విచ్చేసిన వికార్ జనరల్ గారికి, విచారణ సంఘపెద్దలకు, గాయక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

నెల్లూరు మేత్రాసనాన్ని మరియు విశ్వాసులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు దేవుని ప్రార్థిస్తున్నారు.

Add new comment

5 + 0 =