నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు బటాన్‌లోని బాలంగా పీఠాధిపతులు మహా పూజ్య.రూపర్టో శాంటోస్‌ను రిజాల్‌లోని ఆంటిపోలో మేత్రాసనానికి పీఠాధిపతులుగా మే 23,2023 న నియమించారు.

యాంటిపోలో పీఠాధిపతులు మహా పూజ్య ఫ్రాన్సిస్కో డి లియోన్ రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

శాంటోస్ గారు 39 సంవత్సరాలు గురువుగాను మరియు 12 సంవత్సరాలు పీఠాధిపతులుగాను తన సేవలు అందించారు.

మలోలోస్ మేత్రాసనం, బులాకాన్, శాన్ రాఫెల్ నందు అక్టోబరు 30, 1957 న జన్మించారు.

శాన్ కార్లోస్ సెమినరీలో ఫిలాసఫీ మరియు థియాలజీని అభ్యసించారు.

సెప్టెంబర్ 10, 1983న మనీలా అగ్రపీఠానికి గురువుగా అభిషేకింపబడ్డారు.

ఏప్రిల్ 1, 2010న బాలంగా పీఠాధిపతులుగా నియమించబడి, జూలై 8, 2010న అభిషేకింపబడ్డారు.

Add new comment

1 + 3 =