నూతన గురువులు | విశాఖ అగ్రపీఠం

విశాఖ అతిమేత్రాసనం, 08 జూన్ 2022 న విశాఖపట్నం లోని   పునీత పేతురు  కథెడ్రల్, జ్ఞానాపురం లో డీకన్ కచ్చా వేళాంగిణి రాజు, డీకన్ గుంట యోహాన్, డీకన్ తెర్లపు యేసు రత్నం మరియు  డీకన్ ఎర్రరాపు ప్రేం కుమార్  గార్లని విశాఖ అగ్ర పీఠాధిపతి మహా పూజ్య మల్లవరపు ప్రకాష్  గారి దివ్యహస్తాల మీదుగా,  ఛాన్సలర్ గురుశ్రీ  జొన్నాడ జాన్ ప్రకాష్, డీన్ గురుశ్రీ  రాజకుమార్ మరియు ఇతర  గురువులు, మఠవాసులు విశ్వాసుల ఆధ్వర్యములో గురువులుగా అభిషేకించబడ్డారు.   సాయంత్రం 5.౩౦ గంటలకు మొదలైన ఈ పవిత్ర కార్యక్రమము కన్నులపండుగగా జరిగింది.

నూతన గురువులు వేళాంగిణి రాజు,  యోహాన్ మరియు  ప్రేం కుమార్ గారు దేవుని సేవలో ఫలించాలని దైవ ప్రజలకు సేవ చేయాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

13 + 7 =