Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
నూతన కార్డినల్ కృతజ్ఞతా దివ్యబలి పూజ
హైదరాబాద్ అగ్రపీఠం, సికింద్రాబాద్, సెయింట్ మేరీస్ పాఠశాల ప్రాంగణంలో 15 సెప్టెంబర్ 2022న నూతన కార్డినల్ కృతజ్ఞతా దివ్యబలి పూజ అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో నూతనంగా ఎన్నికైన కార్డినల్ పూల అంతోని గారితో పాటు,ముంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్, నేపాల్, భారతదేశానికి పాపు గారి రాయబారికి కార్యదర్శి మోన్స్‌గినోర్ గురుశ్రీ కెవిన్ జస్టిన్ కిమ్టిస్,
మహా పూజ్య.ఎలియాస్ గోన్సాల్వేస్, నాగపూర్ అతిమేత్రాసనం.
మహా పూజ్య.పీటర్ మచాడో, బెంగుళూరు అతిమేత్రాసనం
మహా పూజ్య.రాఫీ మంజాలి , ఆగ్రా అతిమేత్రాసనం.
మహా పూజ్య.అప్లినార్ సేనాపతి, రాయగడ మేత్రాసనం
మహా పూజ్య.శరత్ చంద్ర నాయక్, బెర్హంపూర్ మేత్రాసనం
మహా పూజ్య.నిరంజన్ సువాల్ సింగ్,సంబల్‌పూర్ మేత్రాసనం
మహా పూజ్య. హెన్రీ డిసౌజా, బళ్లారి మేత్రాసనం
మహా పూజ్య.యం.డి. ప్రకాశం, నెల్లూరు మేత్రానులు,టి.సి.బి.సి అధ్యక్షులు
మహా పూజ్య.గాలి బాలి, కడప అడ్మినిస్ట్రేటర్
మహా పూజ్య. గోవింద జోజి, నల్గొండ మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు
మహా పూజ్య.ఉడమల బాల, వరంగల్ మేత్రానులు
మహా పూజ్య. చిన్నాబతిని భాగ్యయ్య, గుంటూరు మేత్రానులు
మహా పూజ్య. పొలిమెర జయరావు, ఏలూరు మేత్రానులు
మహా పూజ్య. రఫీల్ తట్టిల్, శంషాబాద్ మేత్రానులు
గురుశ్రీ అంతోనప్ప చౌరప్ప కర్నూల్ మేత్రాసన పాలనాధికారి
గురుశ్రీ మారినేని బాలస్వామి, నల్గొండ మేత్రాసన పాలనాధికారులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.
వివిధ మేత్రాసనాలనుండి నుండి 500 మంది గురువులు, మఠవాసులు, వేలాదిమంది క్రైస్తవ విశ్వాసులు ఈ దివ్యబలి పూజలో పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్డినల్ గారి కొరకు ప్రార్ధించారు.
"2000 సం॥రాల తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి తెలుగు కార్డినల్గా పూల అంథోని గారు నిలిచారని, అగ్రపీఠాధిపతులు పూల అంతోని గారు కార్డినల్గా పదోన్నతి పొందిన సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా పూజను నిర్విహిస్తున్నామని గురుశ్రీ అల్లం ఆరోగ్యరెడ్డి గారు తెలిపారు.
హైదరాబాద్ అతిమేత్రాసన గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు.
హైదరాబాద్ అగ్రపీఠం యొక్క వికార్జనరల్ ఏరువ బాలశౌరి మరియు ఛాన్సలర్, ప్రొక్యూరేటర్ విక్టర్ ఇమాన్యుయెల్ గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Add new comment