నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గురుశ్రీ కొండవీటి అంతయ్య

గురుశ్రీ తుమ్మ అంతోనిరాజ్ గురుశ్రీ కొండవీటి  అంతయ్య

 క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం విభాగ భాద్యతలు స్వీకరించిన గురుశ్రీ కొండవీటి  అంతయ్య

టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం  

గురుశ్రీ తుమ్మ అంతోనిరాజ్ గారి సేవలకు ధన్యవాదాలు-  నూతన బాధ్యతలు స్వీకరించిన గురుశ్రీ కొండవీటి  అంతయ్య  గారికి స్వాగతం సుస్వాగతం: 

గురుశ్రీ తుమ్మ అంతోనిరాజు గారు నెల్లూరు పీఠానికి చెందిన గురువు.  1999  సంవత్సరము నుండి క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం లో గత 20 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశారు. గత ఆరు సంవత్సరాల క్రితం, టిసిబిసి వారిలో ఉన్న ప్రత్యేకమైన అనుభవాన్ని గుర్తించి క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతర్మత సంవాదం కమీషన్ లో తన సేవలు అందించడానికి అవకాశం ఇచ్చింది. 

మే నెల 31 వ తారీకు 2021 నాడు,  గురుశ్రీ తుమ్మ అంతోనిరాజు గారు  కమిషన్లో తన సేవలను ముగించుకొని నెల్లూరు పీఠానికి  చెందిన గురుశ్రీ కొండవీటి  అంతయ్య  గారికి బాధ్యతలను అప్పగించారు. 

గురుశ్రీ తుమ్మ అంతోనిరాజు గారు చేసిన గొప్ప గొప్ప పనులు , అద్భుతమైన సేవలు  అజరామరం. దేవాది దేవుడు ఆయనకు నిండు నూరేళ్లు దయచేసి ఇంకా అద్భుతమైనటువంటి సేవలు అందించాలని ప్రార్థిస్తూ , నూతనంగా బాధ్యతలు చేపట్టిన గురుశ్రీ కొండవీటి  అంతయ్య గారికి  అమృతవాణి మరియు రేడియో వెరితాస్ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

17 + 2 =