నిష్పాదక కార్మెల్ సభ స్వర్ణోత్సవ జూబిలి వేడుకలు పాల్వంచ విచారణ, ఖమ్మం మేత్రాసనం

నిష్పాదక కార్మెల్ సభ పునీత అవిలాపురి తెరేసమ్మగారు, పునీత స్లివ యోహాను గారు దీనిని పునరుద్ధరించడం జరిగింది. ఆరు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా గురువులు మఠవాసులు ఎన్నో సేవలు శ్రీసభకు అందించారు. ప్రార్థన పశ్చాత్తాప అనే రెండు అంశాలకు కార్మెల్ సభ వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  

కార్మెల్ సభ సభ్యులు కేవలం నాలుగు గోడల మధ్య ఉండి ప్రార్థనచేస్తూ శ్రీసభకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పంచడం కోసం కృషి చేసేవారు.  ఆరవ పాల్ పాపు గారి ప్రేరణ వలన కార్మెల్ సభ గురువులు ప్రజల మధ్య సువార్త పరిచర్య చేయడానికి ముందుకు వచ్చారు.

50 సంవత్సరాల క్రితం వరంగల్ మేత్రాసనానికి చెందిన ఖమ్మం జిల్లా కొత్తగుడెం, భద్రాచలం గిరిజన ప్రాంతాలలో సువార్త పరిచర్య చేయడానికి కార్మెల్ సభ సువార్తికులను వరంగల్ పీఠకాపరులు కీ. శే.అల్ఫోన్సో బెరెట్టే గారు ఆహ్వానించారు.

ఆహ్వానాన్ని మనించి ముగ్గురు గురువులు గురుశ్రీ బెర్నాడిన్ మరియ లూయిస్ గారు, గురుశ్రీ రిచర్డ్ కెసిలీనో గారు, గురుశ్రీ బంద అంథోనీ గారు వరంగల్ పీఠానికి రావడం జరిగింది. 

గురుశ్రీ బెర్నాడిన్ మరియ లూయిస్ గారికి మొట్టమొదటి సుపీరియర్ గా ఖమ్మం జిల్లా కొత్తగుడెం, భద్రాచలం సువార్త భాద్యతను అందించారు. 

వీరు ప్రజల మధ్య ఉంటూ ఇంటింటికి వెళుతూ ప్రజలను యేసు వైపు ఆహ్వానిస్తూ సువార్త పరిచర్యను ప్రారంభించారు.
వీరు మొట్టమొదటిగా తల్లాడ, కొత్తగుడెం,బూడిదంపాడు అను ప్రాంతాలను సువార్త పరిచర్య నిమ్మితం ఎన్నుకోవడం జరిగింది. వీరి జీవితవిధానం ప్రజలకు ఆశక్తికరంగాను స్ఫూర్తిగా నిలిచాయి.

50  సంవత్సరాలలో అనేకమంది క్రీస్తుని స్వీకరించియున్నారు. విద్య, వైద్య, సాంఘీక సేవలతో  ప్రజలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి కార్మెల్ సభ గురువులు ఎంతగానో ప్రయత్నించారు. 

ఖమ్మం మేత్రాసనంలో వీరు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తిస్తూ ఈ రోజు అనగా 8  జూన్ ౨౦౨౨ న పాల్వంచ విచారణ నందు  50  వసంతాలు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.

హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పూల అంతోనీ తండ్రిగారు, ఖమ్మం మేత్రానులు మహా పూజ్య మైపాన్ పాల్ తండ్రిగారు,ఏలూరు మేత్రానులు మహా పూజ్య పొలిమెర జయరావు తండ్రిగారు,వరంగల్ మేత్రానులు మహా పూజ్య ఉడుమల బాల, కర్నూలు అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ మోన్సిగ్నోర్ ఆంథొనప్ప చౌరప్ప గారు ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.

ప్రొవిన్షియల్ సుపీరియర్ గురుశ్రీ జయరాజు బొల్లికొండ గారు విచ్చేసిన పీఠాధిపతులకు , గురుపుంగవులకు, మఠవాసులకు,విశ్వాసులకు కార్మెల్ సభ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసారు. 

 

Add new comment

5 + 9 =