నిరసన వ్యక్తం చేసిన వరంగల్ మేత్రాసన క్రైస్తవులు

ఆగష్టు నెల 10వ తేదీ బుధవారం రోజును క్రైస్తవులందరూ వరంగల్ జిల్లా హన్మకొండ కలక్టరేట్  మరియు వరంగల్ కలక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలక్టర్లకు వినతి పత్రాలను అందచేశారు 

దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చాలని కోరుతూ జిల్లా గ్రంధాలయం ఎదుట దళిత క్రైస్తవులు నిరసన వ్యక్తం చేశారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళిత క్రైస్తవులు సమాజంలో దళితులతో సమానంగా కుల వివక్షను అనుభవిస్తున్నారన్నారు. కానీ, ప్రభుత్వం నుంచి అందే ప్రత్యేక అవకాశాలలో అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు అందక అవకాశాలు కోల్పోతున్నారన్నారు. 

ఇకనైనా ప్రభుత్వం స్పందించి దళిత సిక్కులు, జైనులు, బౌద్ధుల మాదిరి దళిత క్రైస్తవ, ముస్లింలను ఎస్సీలలో చేర్చి న్యాయం చేయాలని కోరారు. 

వరంగల్ పీఠకాపరి మహా పూజ్య ఉడుమల బాల తండ్రిగారు ప్రోత్సాహంతో , ట్రై క్రిస్టియన్ ఫెలోషిప్ చైర్మన్ రెవ .మార్కండేయ గారు, గురుశ్రీ విజయకుమార్ గారు (వరంగల్ SC/ST కమిషన్ ఇంచార్జి), గురుశ్రీ కే.కమల్, గురుశ్రీ కాసు మర్రెడ్డి, గురుశ్రీ జెరోమ్, గురుశ్రీ వీ సైమన్ గార్లు  మరియు ఇతర క్రైస్తవ సహోదరులు పాల్గొన్నారు.

Add new comment

13 + 1 =