నికరాగ్వా నుండి అన్యాయంగా బహిష్కరింపబడ్డ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ

నికరాగ్వా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ

నికరాగ్వాకు చెందిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ మఠకన్యలు ఇటీవల కోస్టారికాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ ఒర్టెగా యొక్క అణచివేత ప్రభుత్వం కారణంగా పొరుగు దేశంలో ఆశ్రయం పొందిన 100,000 నికరాగ్వాన్‌లలో ఇప్పుడు వీరు కూడా భాగమైయ్యారు.

జూన్ 28న నికరాగ్వాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు చేసిన వందకు పైగా సంస్థల్లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ కూడా ఒకటి.

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ మఠకన్యలు చట్టవిరుద్ధంగా డబ్బు మార్పిడి చేస్తున్నారని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఆర్ధిక సహాయం చేస్తున్నారని, సామూహిక విధ్వంసక ఆయుధాల విస్తరణకు ఆర్థిక సహాయం చేస్తున్నారని వారి పై అభియోగం మోపి నికరాగ్వా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థలను నికరాగ్వా దేశంలో రద్దుచేసినట్లు ప్రకటించింది.

మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ బహిష్కరణకు ఎటువంటి తార్కిక వివరణ లేదా చట్టపరమైన ఆధారం లేదు అని, వాస్తవానికి, ఇది అధ్యక్షుడు డేనియల్ ఒర్టెగా పాలన ద్వారా పూర్తిగా నియంతరింపబడుతున్న అసోసియేషన్ నేషనల్ అసెంబ్లీ వారు తీసుకున్న నిర్ణయం అని 
ప్రవాసంలో ఉన్న నికరాగ్వా పాత్రికేయుడు ఇజ్రాయెల్ గొంజాలెజ్ ఎస్పినోజా అన్నారు.

కథోలికులకు వ్యతిరేకంగా అధ్యక్షుడు ఒర్టెగా మరియు అతని భార్య మరియు ఉపాధ్యక్షుడు రోసారియో మురిల్లో యొక్క అణచివేత పరంపరలో ఈ బహిష్కరణ ఒక ముందడుగు అని ఆయన అన్నారు.

మే 2022 నుండి, అక్కడి పీఠాధిపతులు మహా పూజ్య రోలాండో అల్వారెజ్‌ గారిపై పోలీసు వేధింపులు, దాదాపు డజను కథోలిక టీవీ మరియు రేడియో ఛానెల్‌లను మూసివేయడం మరియు గురువులను కూడా ఖైదు చేయడంతో  కథోలికులపై హింస తీవ్రమైంది.

నికరాగ్వా దేశంలో జరుగుతున్న మానవ హక్కులకు సంబంధించిన తీవ్ర ఉల్లంఘనలను ఖండిస్తున్న ఏకైక సంఘం కథోలిక సంఘం అని ఇజ్రాయెల్ గొంజాలెజ్ ఎస్పినోజా అభిప్రాయం పడ్డారు. 

ఎస్పినోజా గురువులను హింసించడం, విచారణలలో గూఢచారులను ఉపయోగించడం మరియు  రోలాండో అల్వారెజ్ పీఠాధిపతిపై మరియు లియోపోల్డో బ్రెన్స్ పీఠాధిపతి వంటి మతాధికారులపై ప్రభుత్వ వేధింపులను ఆయన ఖండించారు.

కలకత్తాకు చెందిన మదర్ థెరిసాచే స్థాపించబడిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ, 1989 నుండి నికరాగ్వాలో సేవ చేస్తోంది మరియు ఆర్ధికంగా దిగువన ఉన్న పిల్లలకు సామాజిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

Add new comment

5 + 13 =