Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు
దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు :
దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదు :
సాధారణం గా ఇప్పటివరకు కోవిడ్ సోకిన వ్యక్తికి ఒక వేరియంట్ ఇన్ఫెక్షన్ మాత్రమే మనం ఇప్పటిదాకా చూశాం, కానీ, మన దేశంలోని తొలిసారిగా ఓ వైద్యురాలికి ఒకేసారి రెండు వేరియంట్లు సోకినట్లు తెలిసింది. ఈ ఘటన అసోంలో వెలుగు చూసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)కి చెందిన రీజనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ (ఆర్ఎంఆర్సీ)లో పరీక్ష చేయించుకున్న ఓ వైద్యురాలికి అల్ఫా, డెల్టా రెండు వేరియంట్లు సోకినట్టు గుర్తించారు.
ఆమెరెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఆల్ఫా, డెల్టా రకం వేరియంట్ కరోనా సోకిందని ఆర్ఎంఆర్సీ పేర్కొంది.రెండు వేరియంట్లు ఒకేసారి సోకిన ఘటనలను ‘డబుల్ ఇన్ ఫెక్షన్’ అంటారని ఆర్ఎంఆర్సీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బిశ్వజ్యోతి బోర్కకోటీ అన్నారు. అయితే వాక్సిన్ వేసుకోవడం వలన డాక్టర్ గారికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని ,ఆసుపత్రిలో చేరకుండానే కోలుకున్నారని తెలిపింది. మే తొలి వారంలోనే ఈ కేసు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. వైద్యురాలి భర్తకు తొలుత జన్యు పరీక్షల్లో ఆల్ఫా వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని, వైద్యురాలి నమూనాలను రెండుసార్లు పరీక్షించినట్టు తెలిపారు. ఇటువంటి డబుల్ ఇన్ఫెక్షన్ కేసులు చాలా అరుదని ఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఐజీఐబీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు
ఇటీవల బెల్జియానికి చెందిన ఒక వృద్ధురాలికి డబుల్ వేరియంట్ గుర్తించారు. అల్ఫా, బేటా ఒకేసారి సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని ఆమె ఈ ఏడాది మార్చిలో చనిపోయింది.
source:samayam
Add new comment