Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఆందోళన కలగజేస్తోంది.
దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఆందోళన కలగజేస్తోంది. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో 47,262 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది. ఇందులో 3,68,457 యాక్టివ్ కేసులు ఉండగా, 1,12,05,160 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న 275 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,60,441కి చేరుకుంది.
కరోనాపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి:
టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్ పాటించాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతరాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టంగా తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు మరింత వేగవంతం చేయాలని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొద్దిరోజులుగా క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ మూసివేస్తున్న ప్రభుత్వం మంగళవారం శాసనసభలో ప్రకటించింది. ఎక్కువ మంది స్కూల్ మరియు హాస్టల్ విద్యార్థులు కరోనా బారిన పడటంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా వైరస్ విజ్రంభింస్తుంది. నిన్నటికి రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,91,641 పాజిటివ్ కేసులకు గాను *8,81,832 మంది డిశ్చార్జ్ కాగా *7,193 మంది మరణించారు, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,616.
Add new comment