దేవుని సేవకు అడ్డురాని ప్రాణాంతక వ్యాధి 

మహా పూజ్య. రోలాండో శాంటోస్డీకన్ ఖమ్సన్ మిమ్ ఖౌంతిచక్

చివరి దశ క్యాన్సర్ కూడా ఒక యువ లావోషియన్ డీకన్ ను గురువు కావాలనే తన కలను సాకారం చేసుకోకుండా నిరోధించలేకపోయింది. డీకన్ ఖమ్సన్ మిమ్ ఖౌంతిచక్ జూన్ 13న పునీత అంథోని వారి పండుగ రోజున మనీలాలో పీఠాధిపతి మహా పూజ్య. రోలాండో శాంటోస్ చేత ఆసుపత్రి మంచంపైనే  గురువుగా అభిషేకించబడ్డారు. 

పాపువా న్యూ గినియాలోని అలోటౌ-సిడియా మేత్రాసన పీఠాధిపతి మహా పూజ్య. రోలాండో శాంటోస్ గారు ఆసుపత్రిలోని ఒక చిన్న బల్లని బలిపీఠంగా ఉపయోగించి దివ్యబలిపూజను చేసి  డీకన్ ఖంసాన్‌ను ఆర్డినాండ్ తలపై చేతులు ఉంచి అతని అరచేతులను పవిత్ర తైలంతో అభిషేకించడం ద్వారా ఆయనను గురువుగా అభిషేకించారు. 

2018లో  ఖంసాన్ విపరీతమైన వెన్నునొప్పిని లోనై తరువాత ఆయనకు వెన్ను క్యాన్సర్ చివరిదశలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, గురువు కావాలనే కోరికను పెంచుకున్నాడు. అతని ఉత్సాహాన్ని గ్రహించిన అతని పీఠాధిపతి ఆయన విద్యను వేగవంతం చేయడానికి అంగీకరించారు. 

2022 జూన్ 13 న ఆయన గురువుగా అభిషేకించబడ్డారు. దేవుని పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసము మరియు కొరికే ఆయనను గురువుగా చేసిందని మహా పూజ్య. రోలాండో శాంటోస్ గారు అన్నారు.

Add new comment

4 + 1 =