దేవునితో ఒక రోజు ప్రార్థన కూటమి

విశాఖ అతిమేత్రాసనం, గిరిజన విచారణ  యర్ర సామంతవలసలో దేవునితో ఒకరోజు కూటమి శనివారం జరిగింది.  విశాఖ అతి మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్ర సామంతవలస విచారణ కర్తలు  గురుశ్రీ పువ్వుల  జీవన్ బాబు గారు  ప్రభు యేసుని ప్రేమను, కరుణను ప్రజలకు మరోసారి తెలియజేశారు. అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. స్తుతి ప్రార్థనలు, పాటలు , దివ్య సత్ప్రసాద ఆరాధన మరియు దివ్య పూజబలితో ప్రజలను  దేవుని సన్నిధికి వైపు నడిపించారు. యర్ర సామంతవలస విచారణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలలో  పాల్గొన్నారు.  కుంభవృష్టిగా కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆద్యంతం దేవుని ఆరాధించారు.  వచ్చిన భక్తులందరికీ గురుశ్రీ పువ్వుల  జీవన్ బాబు గారు ప్రేమ విందును ఏర్పాటు  చేసారు. ఆద్యంతం భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది.  

Add new comment

6 + 1 =